Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, శుభ కార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 16న ) శనివారంవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రోజు శుభవార్తలు వింటారు. విక్రయాల వ్యవహారంలో లాభం చేకూరుతుంది. పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటారు.
వృషభ రాశి: ఈ రోజు ఈ రాశివారు పలు విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఓ వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
మిథున రాశి: ఈ రాశి వారు మనోధైర్యంతో ముందడుగు వేస్తే చేపట్టిన పనులు పూర్తవుతాయి. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు బుద్ధి బలంతో చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. సమస్యలను అధిగమించగలుగుతారు. బంధువుల విషయంలో జాగ్రత్త అవసరం.
సింహ రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆయా రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలు, కుటుంబసభ్యల సూచనలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కన్య రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచనలు చేయాలి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల రాశి: ఈ రాశి వారు కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి శుభ సమయం. పలువురి సహకారంతో కీలక పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ధనుస్సు రాశి: ఈ రాశివారు ఏకాగ్రతతో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకర రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. బంధువులతో సరదాగా గడుపుతారు.
కుంభరాశి: ఈ రాశి వారికి మిశ్రమకాలం. బాగా ఆలోచించి పనులు చేపట్టాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగుతాయి.
మీన రాశి: ఈ రాశి వారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో కీలక పనులను పూర్తి చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం అందుతుంది.
Also Read: