దిన ఫలాలు (డిసెంబర్ 14, 2024): మేష రాశి వారు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ పని తీరు సంతృప్తి కలిగిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆదా యం బాగా వృద్ది చెందుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఆరోగ్యానికి ఇబ్బం దేమీ ఉండదు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన బాధ్యతలను తేలికగా నెరవేరుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పని భారం, పని ఒత్తిడి బాగా తక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొద్దిపాటి అనారోగ్యంతో అవస్థ పడతారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిగత సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. చేపట్టిన పనులు విజ యవంతంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో అనుకోకుండా పదోన్నతి లభిస్తుంది. బంధువుల కారణంగా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు కొత్త లక్ష్యాలను అప్పగించడం జరు గుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గు ముఖం పడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బరువు బాధ్యతలు పెరిగే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణ యాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. ఇంటి పరిస్థితులు అను కూలంగా ఉంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిపాటి ఒత్తిడి, వేధింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ఫలితం ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసు కోవద్దు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఆఫర్ లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇష్టమైన బంధు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హాయిగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, లాభాలకు లోటుండదు. నిరు ద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరు గుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగి పోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు బాగా ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. మీ పనితీరుతో అధికారు లను ఆకట్టుకుంటారు. ప్రతి పని, ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఎక్కువగా లాభాలు గడిస్తాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు వృద్ది చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పను లన్నీ పూర్తవుతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.