Horoscope Today: వారు ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Nov 13, 2023 | 6:52 AM

దినఫలాలు (నవంబర్ 13, 2023): మేష రాశి వారికి ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.వృషభ రాశి వారికి శుభ గ్రహాల బలం కాస్తంత అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు అధికారాలను పంచుకుంటారు. మేష రాశి మొదలు మీనరాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారు ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
Horoscope Today 13th November 2023
Follow us on

దినఫలాలు (నవంబర్ 13, 2023): మేష రాశి వారికి ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.వృషభ రాశి వారికి శుభ గ్రహాల బలం కాస్తంత అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు అధికారాలను పంచుకుంటారు. మేష రాశి మొదలు మీనరాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

శుభ గ్రహాల బలం కాస్తంత అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొం టారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులను, సహో ద్యోగులను పని తీరుతో ఆకట్టుకుంటారు. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి యాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపో తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు అధికారాలను పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. అనవసర వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవు తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది కానీ, ముఖ్యమైన ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇష్టమైన వ్యక్తులతో విందులు వినోదాలతో సరదాగా గడుపు తారు. పిల్లల విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య అవకాశాలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. బంధువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగా వకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపో తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి పోతాయి. రుణాలు వసూలు అవుతాయి. బంధువుల నుంచి రావాల్సిన డబ్బు కూడా అందు తుంది. ఆర్థిక ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధి స్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. కొన్ని మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంటా బయటా గౌరవప్రదంగా సాగిపోతుంది. పిల్లల చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. సతీమణికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి సంతృప్తిని కలిగిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వ హిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కీలక విష యాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు. నూతన ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఆశించిన విధంగా సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు భారీగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది కానీ, కొందరు సహచరుల వల్ల ఇరకాట పరిస్థితులు తలెత్తవచ్చు. మిత్రుల అండ లభిస్తుంది.