Horoscope Today: ఆ రాశి వారికి చాలా అనుకూలంగా ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Jan 13, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 13, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి చాలా అనుకూలంగా ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
Horoscope Today 13th January 2024
Follow us on

దిన ఫలాలు (జనవరి 13, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సర్వత్రా మీ మాటకు విలువ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు నచ్చుతాయి. స్నేహితుల మీద అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. సతీమణితో కలిసి షాపింగ్ చేస్తారు. ఆహార, విహారాలకు సంబంధించి ముఖ్యమైన జాగ్ర త్తలు పాటించడం వల్ల ఆరోగ్యం సహకరిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవు తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవా లేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. చేపట్టిన వ్యవహారాలు విజయ వంతంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. పిల్లల పరంగా శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో జాగ్రత్త.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. జీవిత భాగ స్వామి సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఇంటి వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య మైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవ కాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత పెరగడం, కలుసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు పురోగతి సాధిస్తారు. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగు తుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. సోదరులతో కొద్దిగా ఆస్తి వివాదం తలెత్తే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు. ఉద్యోగులకు ప్రమోషన్ల అందే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయ త్నాలు ఆశించినంతగా సానుకూలపడతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడం జరు గుతుంది. జీవిత భాగస్వామితో పుణ్య కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇతరత్రా కూడా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. దాదాపు అన్ని రంగాల వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహ రించడం మంచిది. రావలసిన డబ్బు అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన అవస రాలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు, పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తల్లితండ్రుల జోక్యంతో ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సామాజికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతికి అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారాలు అనుకూ లంగా, ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇతరుల పనులకు బాగా ఉపయోగపడతారు. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు ఉత్సాహంగా సాగిపో తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి విషయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.