దిన ఫలాలు (జూలై 12, 2024): మేషరాశి వారిని ఒకరిద్దరు మిత్రులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మేష రాశి వారు కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగి పోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించే అవకాశం ఉంది. బంధుమిత్రులలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు ఎక్కువవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఒకరిద్దరు మిత్రులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. సోదరుల నుంచి సహాయ సహ కారాలు అందుతాయి. చేపట్టిన పనులు ఒక పట్టాన ముందుకు సాగవు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటా బయటా సంతోష కరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అన్ని మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగా అనుకూలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక పురోగతి బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కుటుంబ వ్యవహారాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఏదైనా శుభవార్త వినవచ్చు. కొందరు బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉండవచ్చు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహ రించాలి. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం ఎక్కువగా ఉండ వచ్చు. కుటుంబ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరు గుతుంది. ఆర్థిక పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో లాభదాయక పరి చయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రావలసిన సొమ్ము వసూలవుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధమైన చిక్కుల నుంచి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేపట్టి విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలున్నప్పటికీ, నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయ వద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ముఖ్యమైన పనుల్లో అవరోధాలున్నా ముందుకు సాగుతారు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ప్రయాణాలు అన్ని విధాలుగానూ లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అంది వస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. పిల్లల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయటా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం మంచిది. కుటుంబపరంగా బాధ్యతలు బాగా పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరి ష్కారం మీద శ్రద్ధపెట్టడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధనపరంగా ఏ ప్రయత్నం చేసినా సత్ఫలితాలనిస్తుంది. ఇంటికి బంధువులు రావడం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో ఎటువంటి బాధ్యతలను అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందు కుంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
చేపట్టిన పనులు కొన్ని అవరోధాల వల్ల నెమ్మదిగా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక విషయాలన్నీ చాలావరకు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయంలో ఆశించినంత పెరుగుదల కనిపించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కూడా నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ పరిస్థితుల్లో అనుకూలతలు పెరుగుతాయి. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.