Horoscope Today: వారికి ఆశాజనకంగా ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Dec 12, 2023 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 12, 2023): మేష రాశి వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సకాలంలో పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఒకరిద్దరు మిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి ఆశాజనకంగా ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 12th December 2023
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 12, 2023): మేష రాశి వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సకాలంలో పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఒకరిద్దరు మిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగానే ముందుకు సాగుతాయి. విద్యార్థులకు పరవాలేదు. నిరుద్యోగులకు చాలా మంచి ఆపర్ అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఒకరిద్దరు మిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగి, కొద్దిగా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు లాభాలను తెచ్చిపెడతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలపైన దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తి స్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని పనుల కారణంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఆశించినంతగా పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడానికి, కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఇది చాలా మంచి సమయం. తల్లితండ్రుల సహాయ సహకారాలుం టాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగు పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాధ్యతల్ని పెంచుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో రాబడి పెరుగు తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగి పోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఇతరు లకు సహాయం చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొం టారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపో తాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలి స్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా ఉత్సాహంగా, సరదాగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా, ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యయ ప్రయాసలతో కొన్ని పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందు తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కోపతాపాలకు అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఏ ప్రయత్నమైనా సానుకూలపడుతుంది. రోజంతా సమయం బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు, అధికారాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగి పోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శుభ వార్తలు తెస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఉత్సాహం పెరుగు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ, పట్టుదలగా ప్రయత్నాలు కొనసాగిస్తారు. అన్ని విష యాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అను కూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు సరదాగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో చాలావరకు సఫలం అవుతారు. పట్టుదలగా కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంగా అనుకూలంగా సాగిపోతుంది. ఇష్టమైన పనుల్లో నిమగ్నం అవుతారు. ఇష్టమైన ఆల యాలను సందర్శిస్తారు. సన్నిహితులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతి బంధకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలుం టాయి. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి.