
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందు తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పెళ్లి ప్రయ త్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ హామీలు ఉండవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితా లనిస్తాయి. ముఖ్యంగా షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఇంటా బయటా తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు అను కూలి స్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కొందరు బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవు తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బరువు బాధ్యతలను పెంచే అవకాశం ఉంది. వ్యాపారాలు తృప్తికరంగా సాగుతాయి. అదనపు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద మదుపులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అనవసర ఖర్చుల్ని తగ్గించు కోవడం మంచిది. అనారోగ్యంతో కొద్దిగా ఇబ్బంది తప్పకపోవచ్చు. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు కూడా చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపో వడం, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని సకా లంలో పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ది పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు వసూలవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధి స్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ముందుకు సాగుతుంది. కుటుంబంలో కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాల్లో ఎక్కు వగా పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగానే పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయపరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరి ష్కారమై ఊరట కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయ త్నాలన్నీ సఫలం అవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగు తాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశముంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగు తాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపో వచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభ కార్యాల్లో పాల్గొం టారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవు తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి. రావ లసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగు తుంది. కుటుంబ బాధ్యతలు బిజీగా సాగిపోతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు, ఉచిత సహాయా లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. వ్యాపా రాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమవు తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.