దిన ఫలాలు (జూలై 11, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందు తుంది. వృషభ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారి ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన శుభ గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవ కాశం కూడా ఉంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్న వారికి ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అదనపు ఆదాయానికి కొత్త అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. అనుకోకుండా ఒకరిద్దరు బంధువులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగు తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధా న్యం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వాద వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలు, లక్ష్యాలు మీద పడే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సొంత ఆలోచనల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గురు బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వేటికీ లోటుండదు. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలకు ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదా యానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎటువంటి ప్రయత్నాలనైనా ఆచరణలో పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పిల్లలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచనలను విరమించుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం కూడా కలిసి వస్తుంది. రావ లసిన డబ్బు వసూలవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చీకూ చింతా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధువుల సహాయం అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వృత్తి, ఉద్యో గాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు చాలావరకు ఆశాజనకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తయి, ఆర్థిక లాభం కలుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆలయాలను సందర్శించడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆశించిన శుభవార్త వింటారు.
కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వైద్య ఖర్చులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు సరైన పరి ష్కారం లభిస్తుంది. బంధువులతో సరదాగా గడుపుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. సమయం బాగా అను కూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలతో సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన అవకాశాలు అంది వస్తాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఏ పని చేపట్టినా తప్పకుండా అనుకూలంగా పూర్తవుతుంది. కుటుం బంలో ప్రశాంత సానుకూల, సామరస్య వాతావరణం నెలకొంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.