దిన ఫలాలు (జనవరి 11, 2024): మేష రాశి వారు వ్యాపారాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వృషభ రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు బాగా ఒత్తిడి తీసుకువస్తాయి. మిథున రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలలో మీకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొందరు మిత్రుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వ్యక్తిగత సమస్యల్ని ఎంతో సమయ స్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. ఆదాయం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలతో పురోగతి చెందడానికి నడుం బిగిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు బాగా ఒత్తిడి తీసుకు వస్తాయి. ఇతరుల సహాయం తీసుకుని వాటిని పరిష్కరించుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయపరమైన సమస్యలకు ఆస్కారం లేదు. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలకు ఢోకా లేదు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. తల్లితండ్రుల నుంచి అవసర సహాయం లభిస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థికపరమైన ఆలోచనలు, ప్రయత్నాలు ఎక్కువవుతాయి. ఆర్థిక ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. రావలసిన డబ్బును రాబట్టుకోవడం మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉండి, దైవ కార్యాలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవి తంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో ఇతరులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. అందరినీ కలుపుకునిపోవడం జరు గుతుంది. కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవ హారాలను ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలావరకు అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం ఓ మోస్తరుగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు. పనిభారం ఉన్నప్పటికీ ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇంటా బయటా మీ సలహాలకు, సూచనలకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయ ర్లకు, టెక్నాలజీ, టెక్నికల్ నిపుణులకు తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యం నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. సంపాదనకు సమస్యేమీ ఉండదు కానీ, అనవసర ఖర్చు లతో ఇబ్బంది ఉంటుంది. ఏ విషయం అయినా కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
పట్టుదలగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం విషయంలో సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు లేదా అపార్థాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత పురోగతికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇంటి వ్యవహారాలు, ఆర్థిక వ్యవ హారాలు తప్పకుండా ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలను బాగా మెరుగుపరచుకుంటారు. ఆరోగ్యం కూడా బాగా అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం బాగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. అయితే, అనవసర వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, వ్యాపా రాల్లో బాగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి జీవితానికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
ధనుస్పు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. కుటుంబ వ్యవ హారాల్లో సొంత ఆలోచనలు మంచివి. అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు స్నేహితులు మీ తోడ్పాటుతో ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఆధ్యాత్మిక జీవితం మీదకు దృష్టి మళ్లుతుంది. ఆదాయం పెంచుకునేందుకు కుటుంబ సభ్యుల తోనూ, ఇతర సన్నిహితులతోనూ సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మారే ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రకు వెడతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెంచుకోవ డానికి చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పని తీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బును వసూలు చేసుకుంటారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి చేదోడు వాదోడుగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.