Horoscope Today (January 11th 2021): శుభకార్యాలు, పనులు, ప్రయాణం ఇలా ఏవి ప్రారంభించాలన్నా ఈరోజు మన జాతకం ఎలా ఉంది. మంచి , చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 12వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వివాదాల జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. బంధువులు, మిత్రులను కలుస్తారు. వ్రుత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు లభిస్తాయి. శుభ ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తే.. అనుకున్న పనులు పూర్తీ అవుతాయి.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఆర్ధిక సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబంతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పని పూర్తీ చేస్తారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈరోజు హనుమంతుడి ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శ్రమతో కూడిన పనులను పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో ఏర్విపడే విబెధాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతూ.. చక్కటి ఫలితాలు అందుకుంటారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులను సక్సెస్ఫుల్ గా చేస్తారు. వృత్తి,వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉండి.. శుభప్రదంగా జరుగుతుంది. మానసిక ధృడంగా ఉంటారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతుంది. అనుకున్న పనుల్లో ఆలస్యం ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్టారు. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి. శత్రువులపై విజయం సొంతం చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనోదైర్యంతో మందుకు సాగుతారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆచితూచి అడుగు వేయాల్ఉసి ఉంటుంది. కొత్ద్యోతపనులను ప్గరణాళికాబద్ధంగా ప్రారంభిస్తే.. మేలు జరుగుతుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి సమాజంలో పేరు ప్కారఖ్యాతలున్నవారితో పరిచయం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధర్మచింతనతో వ్యవహరిస్తారు.
మీన రాశి: ఈరోజు ఈరాశివారు కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
Also Read: