Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఇక ప్రతి రోజు తమతమ రాశి ఎలా ఉంటుందని తెలుసుకుంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మార్చి 10 (గురువారం)న రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
- మేష రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు.
- వృషభ రాశి: ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం అదుపులో ఉంటుంది.
- మిథున రాశి: చేపట్టిన పనులకు ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉంది. ధైర్యంతో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవడం మంచిది. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు.
- కర్కాటక రాశి: అధికారులతో జాగ్రత్తగా వహించడం మంచిది. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు.
- సింహ రాశి: ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అంతా మంచి జరుగుతుంది.
- కన్య రాశి: ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల ఎంతో అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలున్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.
- తుల రాశి: కొన్ని విషయాలలో మీరు అనుకున్నదానికన్న ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు.
- వృశ్చిక రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు.
- ధనుస్సు రాశి: అందరిని కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో అశ్రద్ద వహించరాదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
- మకర రాశి: ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు పడటం మంచిది. పొదుపు పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరమైన ఆందోళనకు గురవుతారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి.
- కుంభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
- మీన రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి దర్శనం మేలు చేస్తుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
ఇవి కూడా చదవండి: