Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Jan 09, 2025 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 9, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 09th January 2025
Follow us on

దిన ఫలాలు (జనవరి 9, 2025): మేష రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులుంటాయి.మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహా రాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహంగా, ఆశా జనకంగా పురోగమిస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలు గుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉండే అవకాశం ఉంది. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ విషయాలు అనుకూలంగా సాగిపోతాయి. జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తేలికగా విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం నుంచి తేలికగా బయటపడతారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయ వ్యయాలు సమానంగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ఆర్థికపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవ హారాలు, పనుల్లో కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సానుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటుండదు. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ తీరుతెన్నులు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు తప్పకుండా వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజన కంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధపెట్టడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉండవచ్చు. బరువు బాధ్యతలు పెరిగే అవ కాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని చక్కబెట్టడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలే దనిపిస్తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

చిన్నపాటి ప్రయత్నం కూడా బాగా విజయవంతమవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపో తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సాను కూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో సహోద్యోగులకు చేయూతనందిస్తారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చు తుంది. ఆశించిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగం మారడా నికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండక పోవచ్చు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు. నిరుద్యోగులు శుభ వార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యో గావకాశాలు కలిసి వస్తాయి. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశ మనం లభిస్తుంది. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.