Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Mar 07, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 7, 2024): మేష రాశి వారికి రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు
Horoscope Today 07th March 2024
Follow us on

దిన ఫలాలు (మార్చి 7, 2024): మేష రాశి వారికి రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి సంపాదన విశేషంగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు, ప్రతిఫలం ఉంటాయి. నిరుద్యోగులకు తప్ప కుండా ఆఫర్లు అందుతాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశించిన ఫలితాలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రయాణాల్లో ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. మీ నెట్ వర్క్ పెరుగుతుంది. కుటుంబసమేతంగా దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యయంలో ఉన్న గురువు కారణంగా మధ్య మధ్య చిన్నా చితకా సమస్యలు తప్పవు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆదాయానికి మాత్రం ఎటువంటి లోటూ ఉండదు. ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగు లకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాల్లో బిజీ అయిపోవడం, లాభాలు పెరగడం వంటివి జరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ నిపుణులకు క్షణం కూడా తీరికి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. ధన, కుటుంబ స్థానాల మీద శుభ గ్రహాల దృష్టి బలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సభ్యులు పురోగతి చెందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అప్పుడప్పుడూ సప్తమ శని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. అడపాదడపా చిన్నా చితకా అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మిమ్మల్ని బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ప్రయాణాలు లాభి స్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపా రాల్లో క్రమంగా అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ సంబంధమైన కార్య క్రమాల్లోనూ, సమాజ సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అవసర సమయాల్లో స్నేహితులు అండగా నిలబడతారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటవుతుంది. వ్యాపారాల్లో కూడా మీ వ్యూహాలు, ఆలోచ నలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యులను కూడా కలుపుకునిపోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కాస్తంత ఆచి తూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. అధికారులకు అండగా ఉంటారు. వ్యాపారాలలో విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. కుటుంబ పెద్దల నుంచి సంపద కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. పిల్లలకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. తోబుట్టు వుల నుంచి ఆశించిన వర్తమానం అందుకుం టారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరి స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారుల సహకారంతో ప్రధాన లక్ష్యాలను పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. వ్యాపా రుల ఆలోచనలు, వ్యూహాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కొందరు స్నేహితులు లేదా దగ్గర బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఎక్కువగా కుటుంబ సభ్యులతో సరదాగా కాల క్షేపం చేస్తారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవ కాశం ఉంది. అవసర సమయాల్లో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాల్లో అడ్డంకులు, చికాకులు తొలగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని పరి ష్కరించుకుంటారు. మనసులోని కోరిక నెరవేరుతుంది. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో కూడా బాగా ఒత్తిడి పెరుగుతుంది. వీటి వల్ల ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు అందుతాయి. కుటుంబ సమస్యల పరిష్కారంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక వ్యవహరాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యాపారాల మీద దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు చేపట్టి ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కీలకమైన పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.