
దిన ఫలాలు (ఫిబ్రవరి 7, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం ఆశించినంతగా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉండి..అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రమ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆదాయం ఆశించినంతగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా కొద్దిగా బయటపడతారు. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలల్ని మించుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానేఉంటుంది.
అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా అంచనాలను మించిన లాభాలు కలుగుతాయి. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సజీవుగా సాగిపోతాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూ లంగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో లాభాలు కలుగుతాయి. నిరుద్యో గులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.
అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్థిక సమస్యల్ని తగ్గించుకుంటారు. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి చెందుతారు.
సోదరులు, మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. వీటివల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగం విషయంలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో జీత భత్యాల విషయంలో అధికారుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. తల్లితండ్రుల వల్ల సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కా రమవుతుంది. కుటుంబ సభ్యల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, ఒకటి రెండు ఆర్థిక సమ స్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. అధి కారులు నిర్దేశించిన లక్ష్యాలను, బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి, వ్యాపారాలు కొద్దిగా బిజీగా సాగిపోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదా నంగా సాగిపోతాయి. పెండింగ్ పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కొందరు బంధుమిత్రుల నుంచి నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవ కాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువుల వల్ల మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. దాంపత్య జీవితం కూడా హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ద పెంచుతారు. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్ప డతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులు, శ్రమకు తగ్గ లాభాలు అందుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. రావలసిన డబ్బు అందకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం ఇబ్బంది పెడుతుంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కొద్దిపాటి లాభాలు కలుగు తాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. బంధు మి త్రులతో కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యో గులకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.