దిన ఫలాలు (డిసెంబర్ 7, 2023): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిథున రాశి వారికి ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. చేపట్టిన పనులను సంతృప్తి కరంగా పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. మీ మాట చెలామణీ అవుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభ సాటిగా పురోగతి చెందుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలుంటాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగి పోతుంది. వ్యాపారాల్లో పోటీ పెరిగినా నష్టమేమీ ఉండదు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో సహచరులతో ఇబ్బందులు ఏర్పడ తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. అయితే, కుటుంబపరంగా ఒకటి రెండు చికాకులు తప్పకపోవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యాలు తప్పకుండా సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి విస్తరిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు, వివాదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్ర త్తలు పాటించడం మంచిది. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడడం జరుగుతుంది. విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిదానంగా ముందుకు వెడతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. తలపెట్టిన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభకార్యం మీద బాగా ఖర్చు చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో ఎటువంటి వ్యవహారమైనా పూర్త వుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరు గుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొన్ని ప్రముఖ సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా ముందుకు సాగుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను శ్రద్ధగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు కార్య క్రమంలో పాల్గొంటారు. దైవ కార్యాలకు, సహాయ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆరోగ్యం పరవా లేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. బంధు మిత్రులతో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణా ల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.