Horoscope Today: ఆ రాశి వారికి అనూహ్యంగా వాహన యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Nov 05, 2024 | 5:01 AM

Today Horoscope(05th November 2024): మేష రాశి వారికి ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. మిథున రాశి వారికి అనుకోకుండా వాహన యోగం పట్టే అవకాశం ఉంది. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి.

Horoscope Today: ఆ రాశి వారికి అనూహ్యంగా వాహన యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today
Follow us on

దిన ఫలాలు (నవంబర్ 5, 2024): మేష రాశి వారికి ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. మిథున రాశి వారికి అనుకోకుండా వాహన యోగం పట్టే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకున్న వ్యవహారాలన్నీ ముందుకు సాగుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కొందరు బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యాపారాలు నిదానంగా, లాభసాటిగా సాగు తాయి. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు, అవకాశాలు అంది వస్తాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. చదువుల్లో పిల్లలకు కొత్త అవకాలు అందుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు కలుగుతాయి. అనుకోకుండా వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సునాయాసంగా, సంతృప్తికరంగా పూర్తవు తాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం దొరికే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యాలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆదాయం సంతృప్తికర స్థాయిలో పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. నిరుద్యోగు లకు సమయం అనుకూలంగా ఉంది. కొందరు మిత్రుల వ్యవహారాలు బాగా చికాకు పెడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కష్టార్జితంలో ఎక్కువ భాగం మిత్రుల మీద వృథా అవుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగు తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులన్నీ కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు యథావిధిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. చేపట్టిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొత్త మిత్రులు ఏర్పడతారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవు తాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువుల వివాదాలను పరిష్కరించే అవకాశం ఉంది. నిరుద్యోగులు సంతృప్తికరమైన ఆఫర్లు అందు కుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మరింత ఉత్సాహంగా పనిచేసి, అధికారుల ప్రశంసలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. సోదరులతో ఆస్తి ఒప్పందాలు కుదర్చుకుం టారు. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఎదురు చూస్తున్న శుభ సమాచారం అందుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. కీలక వ్యవహారాలు చురుకుగా, వేగంగా పూర్తవుతాయి. ఇంటా బయటా సంతోషకరమైన సంఘ టనలు చోటు చేసుకుంటాయి. సోదరులతో అపార్థాలు తొలగి, సఖ్యత పెరుగుతుంది. ఆదాయ మార్గాల వల్ల ఆదాయం సంతృప్తికర స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనుకున్న పనులు అనుకున్న రీతిలో పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని ఆహ్వా నాలు అందుతాయి. వ్యాపారులు పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్య తలు మారడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొంత వరకు విముక్తి లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్తోమతకు మించి మిత్రులకు సహాయపడతారు.

కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను అధికారులు గుర్తిస్తారు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. కొందరు మిత్రులతో అపార్థాలు, విభేదాలు తొలగిపోతాయి. పిల్లల చదువుల విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అనేక విధా లుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమస్య లకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు కనిపిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రులతో సానుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల వాద వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.