దిన ఫలాలు (సెప్టెంబర్ 3, 2024): మేష రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దానితో పాటే కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకున్న పనుల్ని సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలను తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ, దానితో పాటే కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్య పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబ వ్యవహారాలు కొద్దిగా చికాకు పెడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దైవ చింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
స్థిరాస్తి వివాదాలు, సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మెరుగుదల ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపా రాల్లో మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. ఆదాయం స్వల్పంగా వృద్ధి చెందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా కొన్ని ఊహించని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుం బసమేతంగా పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ప్రయాణాలు పెద్దగా లాభించకపోవచ్చు. ఆదాయం పెరగడానికి బాగా అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. చిన్న నాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాల్లో ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. అను కోకుండా వాహన యోగం పడుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మంచి లాభాలతో సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గు తుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభ త్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థికా భి వృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి. బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యులతో మాట తొందర పనికి రాదు. వ్యాపా రాలు ఉత్సాహంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహా రాలు శ్రమతో గానీ పూర్తి కావు. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదని పిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సోద రులతో ఆస్తి వివాదం మీద చర్చలు జరుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతా నికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు మరింత ఎక్కువ అవుతాయి. పిల్లల నుంచి శుభ వార్త వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఇల్లు కొనడం మీద దృష్టి సారిస్తారు. ఇష్టమైన మిత్రులతో విహార యాత్ర తలపెడతారు. సమా జంలో పెద్దలతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. పిల్లల చదువులకు సంబం ధించి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా ఆరోగ్య సమస్యలుం టాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పనిభారం, పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటికి అవసరమైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవ హారాలు సానుకూలంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభం కని పించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొద్దిపాటి ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.