దిన ఫలాలు (జూలై 3, 2024): మేష రాశి వారికి ఈరోజు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. వృషభ రాశి వారి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు సాగిపోతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి బాగా తగ్గి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. పోటీదార్లు, ప్రత్యర్థుల ఇబ్బంది తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపో తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత, ఒత్తిడి ఉన్నప్పటికీ రాబడికి లోటుండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం నిలక డగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు నెమ్మదిగా పూర్తవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యుల కోసం బాగా ఖర్చు పెట్టడం జరుగు తుంది. ఆస్తిపాస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఒకటి రెండు శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరంగా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా సానుకూలతలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగ స్వామి సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడ తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆశించిన శుభవార్తలు వినడం జరుగు తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులున్నా అధిగమిస్తారు. ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. కుటుంబంలో మీ ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశముంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
తోబుట్టువులతో ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆర్థిక ప్రయత్నాలలో విజయం సాధి స్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయిగానే ఉంటారు. మధ్య మధ్య కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో పని భారం బాగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుం టాయి. ఇంటా బయటా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఇతరు లకు అనవసర సహాయాలు చేసి ఇబ్బందులు పడతారు. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిం చడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట )
ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. కుటుంబంలో ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలకు ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఊహించని శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు ఉండవచ్చు. బాధ్యతల్ని మార్చడం వల్ల ఇబ్బంది పడతారు. అదనపు ఆదాయ మార్గాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అయితే, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. చాలా కాలంగా ఒత్తిడి కలిగిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. అనారోగ్య సమస్యల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది. కొందరు దగ్గర బంధువు లతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు తాపీగా పూర్తవు తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. పోటీదార్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను సకాలం పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకల కారణంగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఆశాభంగం తప్పకపోవచ్చు. ప్రయాణాల్లోనూ, ఆహార విహారాల్లోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆస్తి వ్యవహారాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆస్తిపాస్తుల విలువ పెరిగే అవ కాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ధన వ్యవ హారాల్లో అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక చింతన పెరిగి, కుటుంబసమేతంగా ఆల యాలను సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.