Horoscope: ఈ రాశివారు స్నేహితులతో జర జాగ్రత్త.. అందులో మీరున్నారా.. చూసేయండి.!

| Edited By: Ravi Kiran

Dec 04, 2023 | 6:50 AM

కొందరు స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం శ్రేయస్కరం. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు తమ కార్యకలాపా లను విస్తరించే అవకాశం ఉంది.

Horoscope: ఈ రాశివారు స్నేహితులతో జర జాగ్రత్త.. అందులో మీరున్నారా.. చూసేయండి.!
Astrology
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఇంతవరకు ప్రతికూలంగా ఉన్న పరి స్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఒక్క క్షణం కూడా విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో వేగం, ఉత్సాహం పెరుగు తాయి. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అన్ని విధాలుగానూ సంపాదన పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సాను కూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా సన్నిహితం అవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా కొనసాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు ఊపందుకుంటాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. సతీమణితో దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా పనిభారం పెరుగుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కోరు కున్న ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వివాహ ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొందరు స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం శ్రేయస్కరం. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు తమ కార్యకలాపా లను విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా కార్యాల్లో పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆటంకాలున్నా పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకుంటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమయం బాగా అనుకూలంగా ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. రోజువారీ కార్య క్రమాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీ సలహాలు అధికారులకు నచ్చుతాయి. వ్యాపారాలను విస్తరించుకునే ఆలోచన చేస్తారు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అన్ని విషయాలలోనూ సానుకూల వాతావరణం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో లాభదాయక మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే రోజంతా మీకు అనుకూలంగానే సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుం టారు. మిత్రులకు వీలైనంతగా సాయం చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అన్ని విధాలుగానూ సానుకూల పరిస్థితులుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. సహోద్యోగులతో ఇబ్బందులేమీ ఉండక పో వచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవ కాశం ఉంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపు తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

పనిభారం ఎక్కువగా ఉండడం, ఇంటా బయటా ఒత్తిడి పెరగడం వంటివి ఉంటాయి. అధికారులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపా రాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అంది స్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు, హామీలు ఉండవద్దు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వ్యయ ప్రయాసలను కూడా లెక్క చేయకుండా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడ తారు. ఒకటి రెండుకొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు పరవాలేదని పిస్తాయి. ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఒకటి రెండు చికాకులు తప్పకపోవచ్చు. సతీమణికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది.