Half Yearly 2024 Horoscope
జూన్ నెలతో ఈ ఏడాది మొదటి భాగం గడిచిపోయినందువల్ల జూలై నుంచి మిగిలిన ఆరు నెలల కాలంలో ఎలా ఉండబోతోందన్నది పరిశీలించాల్సిన విషయం. శని, రాహు, కేతు, గురు గ్రహాలు ఈ ఏడాదంతో వారు ప్రస్తుతం ఉన్న రాశుల్లోనే సంచారం చేస్తుండడం వల్ల ఫలితాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ, జూలైలో రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాల రాశి మార్పుల కారణంగా కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకోవచ్చు. మొత్తం మీద మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్పు, మకర రాశుల వారికి మాత్రం మిగిలిన ఆరు నెలల కాలం గడచిన ఆరు నెలల కంటే అదృష్టవంతంగా ఉండబోతోంది.
- మేషం: ఈ రాశివారికి గురు, శనులతో పాటు రాశ్యధిపతి కుజుడి సంచారం కూడా ఈ ఏడాది చివరి వరకూ బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఉద్యోగంలో ప్రాభవం మరింతగా పెరగడం, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం, హోదాలు పెరగడం వంటివి తప్పకుండా చోటు చేసుకుం టాయి. లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురువు వల్ల ఆదాయం వృద్ధి చెందడమే కానీ, తగ్గడం ఉండదు. విదేశీయానానికి, విదేశాల్లో సంపాదనకు కూడా అవకాశాలు బాగా పెరుగుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి గురువు లాభస్థానంలో బాగా అనుకూలంగా ఉండడం, ఏడాది చివరి వరకూ రాహు కేతువులు, జూలై నుంచి బుధ, రవి, శుక్రులు కూడా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఆశయ సిద్ధికి, ఆదాయ వృద్ధికి బాగా అవకాశాలున్నాయి. ఏ పని తలపెట్టినా తప్పకుండా విజ యవంతం అవుతుంది. ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.
- కన్య: ఈ రాశివారికి శని ఆరవ స్థానంలో ఉండడం ఒక విశేషం కాగా, భాగ్య స్థానంలో గురు సంచారం మరొక విశేషం. వీటితో పాటు బుధ, శుక్రులు కూడా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. విదేశీయాన యోగం పడుతుంది. ఆరోగ్య భాగ్యం కూడా పడుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు సంచారం కొండంత బలం ఇస్తుంది. రాహు కేతువులతో పాటు శుక్ర, రవులు కూడా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంటుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. సంతృప్తికరమైన జీవితం గడపడం జరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో శనీశ్వరుడు అనేక విధాలుగా పురోగతినిస్తాడు. రాశ్యధిపతి గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల శత్రు, రోగ, రుణ బాధలను దగ్గరకు రానివ్వడు. మొత్తం మీద వచ్చే ఆరు నెలల కాలం మొదటి ఆరు నెలల కంటే మరింత యోగదాయకంగా నడిచిపోతుంది. విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.
- మకరం: ఈ రాశికి ఈ సంవత్సరమంతా శని, రాహు, కేతువు, గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజపూజ్యాలకు లోటుండదు. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆస్తి వివాదం పరి ష్కారం అయి, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.