Guru Moudyami 2023
Image Credit source: TV9 Telugu
Guru Moudyami 2023: గత నెల 28వ తేదీన గురుమూడమి ప్రారంభం అయింది. ఇది ఈ నెల(ఏప్రిల్) 30 వరకు కొనసాగు తుంది. ఈ నెల రోజుల కాలంలో శుభకార్యాలు ఏవీ జరపకూడదు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, భూమి పూజ వంటి శుభకార్యాలను ఎటువంటి పరిస్థితులలోనూ జరపకూడదని శాస్త్రం స్పష్టం చేస్తోంది. గురుగ్రహం సూర్యగ్రహా నికి దగ్గరగా వెళ్ళినప్పుడు సూర్యుడి వేడిమికి తల్లడిల్లిపోతుంది. ఫలితంగా బాగా బలహీన పడిపోతుంది. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వెళ్లడాన్నే గురు మౌడ్యం లేదా గురుమూడమి అంటారు. గురుగ్రహం శుభకార్యాలకు, దైవానుగ్రహానికి కారకుడు. అటువంటి గ్రహం సూర్యుడి వేడిమికి బలహీన పడినప్పుడు శుభకార్యాలు చేయడం మంచిది కాదు. గురువు అనుగ్రహం లేనిదే శుభకార్యాలు విజయవంతం అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల గురు మూఢమి కాలంలో శుభకార్యాలను జరపడం జరగదు. దాంపత్య జీవితం కూడా ప్రారంభించ కూడదు. పెళ్లి ప్రయత్నాలు చేయవచ్చు కానీ సంబంధం ఖాయం చేసుకోవడం, ముహూర్తం నిర్ణయించడం వంటివి కూడా చేయకూడదు.
శుభ యోగాలకు అనుకూలం..
ఏ రాశిలో అయినా గురు రవి గ్రహాలు కలవడం శుభకార్యాలకు మంచిది కాకపోయినా కొన్ని రాశులకు శుభయోగాలను మాత్రం కలిగిస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఈనెల 30వ తేదీ వరకు వృషభం, కర్కాటకం, వృశ్చికం, కుంభ రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు. సాధారణంగా ఈ రెండు గ్రహాల కలయిక ఉద్యోగం, వృత్తి, ఆదాయం వంటి అంశాలలో శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం అధికారం చేపట్టడం వంటివి తప్పనిసరిగా జరుగుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులకు మంచి గుర్తింపు లభించి విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా అకస్మాత్తుగా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభం అవుతుంది.
- వృషభ రాశి: ఈ రాశి వారికి 11వ స్థానంలో అంటే లాభ స్థానంలో గురు, రవులు కలవటం వల్ల ఉద్యోగ పరంగా మంచి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా అధికారం చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో సాను కూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుం టాయి. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఎంతో ఆశాజనకంగా కనిపిస్తుంది. అధికారులు ఈ రాశి వారి మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. నిరుద్యోగులకు సరైన కంపెనీలో మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. జీవితానికి సంబంధించి కొన్ని శుభ పరిణామాలు తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. పలుకుబడి కలిగిన వారితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి గురు, రవి గ్రహాలు తొమ్మిదవ స్థానంలో అంటే భాగ్యస్థానంలో కలవడం వల్ల విదేశాలలో ఉద్యోగానికి లేదా చదువులకు లేదా స్థిరపడటానికి అవకాశం ఏర్పడుతుంది. విదేశీ యానానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. వీసా సంబంధమైన సమస్యలు పరిష్కారం అవు తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిర్ణయాలు ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. తండ్రి ఇచ్చిన ఆస్తి విలువ పెరుగుతుంది. తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సంతాన యోగానికి సంబంధించి మంచి కబురు వినవచ్చు. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఐదవ స్థానంలో గురు, రవిగ్రహాల కలయిక జరుగుతోంది. వీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రారంభించిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. పిల్లల గురించి శుభవార్తలు వింటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారులు మీ సలహా లను, సూచనలను తూచా తప్పకుండా పాటించి ప్రయోజనం పొందుతారు. అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీ కన్నా పై స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. చెడు వ్యసనాలు ఏవైనా ఉంటే వాటి నుంచి విముక్తి పొందటానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచిది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మీరు ఆశించిన విధంగానే పూర్తవుతాయి.
- కుంభ రాశి: ఈ రాశి వారికి రెండవ స్థానంలో గురువు, రవి కలవడం అనేది ఆర్థికపరంగా ఎంతో అనుకూల మైన కాలమని చెప్పవచ్చు. అనుకోకుండా ఆదాయం బాగా పెరిగి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. పొదుపు సూత్రాలను పాటిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కుటుంబం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..