Lord Shani Dev: లాభ స్థానంలో గురువు.. పరిహారాలు లేకుండానే శని దోషం నుంచి ఆ రాశుల వారికి విముక్తి..

| Edited By: Janardhan Veluru

May 07, 2024 | 4:37 PM

ఎటువంటి పరిహారాలూ చేయకుండానే అయిదు రాశులకు శని దోషం నుంచి విముక్తి లభించింది. దాదాపు సంవత్సర కాలంగా ఏ పనీ కాక, రావలసిన సొమ్ము చేతికి అందక, అనారోగ్యాలతో బాధపడతూ, ఆర్థిక పరిస్థితి కుంటుపడి ఇబ్బంది పడుతున్న వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారికి వీటి నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తోంది.

Lord Shani Dev: లాభ స్థానంలో గురువు.. పరిహారాలు లేకుండానే శని దోషం నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Lord Shani Dev
Follow us on

ఎటువంటి పరిహారాలూ చేయకుండానే అయిదు రాశులకు శని దోషం నుంచి విముక్తి లభించింది. దాదాపు సంవత్సర కాలంగా ఏ పనీ కాక, రావలసిన సొమ్ము చేతికి అందక, అనారోగ్యాలతో బాధపడతూ, ఆర్థిక పరిస్థితి కుంటుపడి ఇబ్బంది పడుతున్న వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారికి వీటి నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం వృషభ రాశిలో ప్రవేశించిన గురువే. ఈ రాశులకు గురువు పూర్తి అనుకూలంగా మారడంతో ఏలిన్నాటి శని, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాల నుంచి పూర్తిగా ఉపశమనం లభించిందని భావించవచ్చు. 2025 జూలై నుంచి తొలగిపోవలసిన శని సమస్యలు ఇప్పటికిప్పుడే తొలగిపోవడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశముంది. బరువు బాధ్యతల కారణంగా విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. మానసికంగా కూడా ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ రాశిలో ప్రస్తుతం గురు సంచారం ప్రారంభమైన కారణంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పనిభారం తగ్గిపోతుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తేలికగా లాభాలు గడించగలుగుతారు.
  2. కర్కాటకం: ఈ రాశికి అష్టమ రాశిలో శనీశ్వరుడి సంచారం వల్ల అష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల వీరికి వ్యవహారంలోనూ శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాక ఇబ్బంది పడతారు. పెళ్లి ప్రయత్నాల వల్ల ఫలితం ఉండదు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. గొర్రె తోక బెత్తెడు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. లాభ స్థానంలో గురువు ప్రవేశించడంతో ఈ దోషాలన్నీ తొలగిపోయి, అధికార యోగం, సంపన్న యోగం కలుగుతాయి.
  3. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల పదోన్నతులు, ఆదాయం పెరుగుదల వంటివి ఆగిపోయే అవకాశముంటుంది. శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనీ బాగా ఆలస్యం అవుతుంటుంది. నిరాశా నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి ప్రస్తుతం దశమంలో గురువు సంచారం వల్ల ఈ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. మీకు రావలసిన సొమ్ము అందుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం మారిపోతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి అర్ధాష్టమ శని కారణంగా కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండడం, మనశ్శాంతి లోపిం చడం, గృహ, వాహన సమస్యలు తలెత్తడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చే అవకాశముండదు. ప్రస్తుతం గురువు ఈ రాశికి సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. సంపద బాగా పెరుగుతుంది.
  5. మకరం: ఈ రాశికి ఏలిన్నాటి దోషం ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబ పరిస్థితలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉండవు. శుభ కార్యాలు ఆగిపోతాయి. ప్రస్తుతం గురువు ఈ రాశికి పంచమ స్థానంలో ప్రవేశించినందువల్ల ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. ధన ధాన్య వృద్ది పుష్కలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి బాగా తగ్గిపోతాయి.