Guru Gochar 2025
వచ్చే ఏడాది మే 25న గురువు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి మారడం జరుగుతోంది. గురువు ఈ రాశిలో ఏడాదిపాటు ఉంటాడు. గురువు ఈ రాశిలో సంచారం ప్రారంభించి నప్పుడు సాధారణంగా మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఇబ్బందులు కలిగించ వలసి ఉంటుంది. అయితే, కొన్ని రాశులకు మిథున రాశి దుస్థానమే అయినప్పటికీ ఇక్కడ సంచారం చేస్తున్న గురువు ప్రతికూల ఫలితాల కంటే మిశ్రమ ఫలితాలనే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. గురువు సహజ శుభ గ్రహమైనందువల్ల ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉండదు. గురువుకు 1, 2, 5, 7, 9, 11 స్థానాలు మాత్రమే శుభ స్థానాలు. మిగిలిన స్థానాలు దుస్థానాలు.
- మేషం: ఈ రాశికి గురువు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొద్దిగా ధైర్యం, ఆత్మవిశ్వాసం, చొరవ వంటివి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల కొన్ని రకాల ఈతిబాధలు కలుగుతాయి. ఉద్యో గులు దూర ప్రాంతానికి బదిలీ కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు కూడా విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వీటివల్ల ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఆర్థిక వ్యవహా రాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ, పొదుపు పాటించడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. దీనివల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపా రాల్లోనూ శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అధికారులు అతిగా ఆధారపడడం జరుగుతుంది. గురువు ఈ రాశిలో ఉన్నంత కాలం ఉద్యోగానికి భద్రత ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని శుభ పరి ణామాలు కూడా చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు.
- వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల అడపా దడపా అనారోగ్య సమస్యలు పీడించడం జరుగుతుంది. ఏడాది పాటు ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది. అనుకోకుండా అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అనేక అవకాశాలు అంది వస్తాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో గురు ప్రవేశం వల్ల ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఆర్థిక సమ స్యలు మాత్రం త్వరితగతిన పరిష్కారం అవుతాయి. అయితే, ఆర్థిక లావాదేవీలకు, ధనపరమైన వాగ్దానాలు, హామీలకు దూరంగా ఉండడం మంచిది. శుభ కార్యాలు, పుణ్య కార్యాల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇతరులకు ఎక్కువగా సహాయం చేయడం జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
- మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ సౌఖ్యం బాగా తగ్గుతుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సామాజికంగా హోదా, స్థాయి పెరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. షేర్లు, స్పెక్యు లే షన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.