Gaja Kesari Yoga: గజ కేసరి యోగం.. ఆ రాశుల వారికి విజయ యోగాలు పక్కా..!

| Edited By: Janardhan Veluru

Oct 18, 2024 | 7:32 PM

అక్టోబర్ 19, 20, 21 తేదీల్లో చంద్రుడు తనకు ఉచ్ఛ క్షేత్రమైన వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. వృషభ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న గురువుతో చంద్రుడు కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా, సప్తమ స్థానమైన వృశ్చికం నుంచి శుక్ర గ్రహం ఈ చంద్ర, గురువులను వీక్షించడం వల్ల సుఖ సంతోషాలు, మనశ్శాంతి వంటివి కూడా కలుగుతాయి. గజకేసరి యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయ వృద్ధికి, అధికార యోగానికి అవకాశం ఉంటుంది.

Gaja Kesari Yoga: గజ కేసరి యోగం.. ఆ రాశుల వారికి విజయ యోగాలు పక్కా..!
Gaja Kesari Yoga
Follow us on

ఈ నెల 19, 20, 21 తేదీల్లో చంద్రుడు తనకు ఉచ్ఛ క్షేత్రమైన వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. వృషభ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న గురువుతో చంద్రుడు కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా, సప్తమ స్థానమైన వృశ్చికం నుంచి శుక్ర గ్రహం ఈ చంద్ర, గురువులను వీక్షించడం వల్ల సుఖ సంతోషాలు, మనశ్శాంతి వంటివి కూడా కలుగుతాయి. గజకేసరి యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయ వృద్ధికి, అధికార యోగానికి అవకాశం ఉంటుంది. మనసులోని కోరికలు, ఆశలు తీరే అవకాశం ఉంటుంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ మూడు రోజుల కాలం వైభవంగా సాగిపోతుంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో గురు, చంద్రులు కలవడం, ఈ రెండు గ్రహాలను ధనాధిపతి శుక్రుడు వీక్షించడం వల్ల ధనాభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సఫలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛ పట్టడం ఒక విశేషంగా, దానితో గురువు కలవడం, శుక్రుడు వీక్షించడం వల్ల మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో కలతలు సమసిపోతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి.
  3. కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభస్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు గజకేసరి ఏర్పడడం, శుక్రుడు వీక్షిం చడం వల్ల అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశం ఉంది. దాదాపు ప్రతి ఆదాయ ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. లాభదాయక పరిచయాలు, లాభదాయక ఒప్పందాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉపయోగకర పరిచయాలు ఏర్పడ తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఇష్టపడిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం, దాన్ని శుక్రుడు వృశ్చిక రాశి నుంచి వీక్షించడం వల్ల ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశికి పంచమ కోణంలో గజకేసరి యోగం పట్టడం, దీన్ని లాభ స్థానం నుంచి శుక్రుడు వీక్షిం చడం వల్ల అనేక శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయికి చేరుకుంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శి స్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది.