Full Moon Horoscope: పౌర్ణమితో ఆ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి.. వారికి ధనలాభాలు..!

| Edited By: Janardhan Veluru

Jul 21, 2024 | 4:58 PM

ఆదివారం (జులై 21న)నాటి పౌర్ణమి వల్ల కొన్ని రాశుల వారికి కొన్ని రకాల కష్ట నష్టాల నుంచి విముక్తి లభించబోతోంది. జ్యోతిషశాస్త్రంలో రవి, చంద్రుల పరస్పర వీక్షణ వల్ల పౌర్ణమి ఏర్పడుతుంది. దీనివల్ల చంద్రుడికి బలం పెరుగుతుంది. చంద్రుడు అనుకూలంగా ఉన్న రాశుల వారు ఈ పౌర్ణమి వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.

Full Moon Horoscope: పౌర్ణమితో ఆ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి.. వారికి ధనలాభాలు..!
Full Moon July 2024 Horoscope
Follow us on

ఆదివారం (జులై 21న)నాటి పౌర్ణమి వల్ల కొన్ని రాశుల వారికి కొన్ని రకాల కష్ట నష్టాల నుంచి విముక్తి లభించబోతోంది. జ్యోతిషశాస్త్రంలో రవి, చంద్రుల పరస్పర వీక్షణ వల్ల పౌర్ణమి ఏర్పడుతుంది. దీనివల్ల చంద్రుడికి బలం పెరుగుతుంది. చంద్రుడు అనుకూలంగా ఉన్న రాశుల వారు ఈ పౌర్ణమి వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మాతృ సౌఖ్యం పెరుగుతుంది. మాతృమూలక ధన లాభం ఉంటుంది. మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి ఈ పౌర్ణమి వల్ల అంచనాలకు మించిన మేలు జరిగే అవకాశం ఉంది. ఇది గురు పూర్ణిమ అయినందువల్ల, దత్తాత్రేయ స్వామికి లేదా గురువులకు లేదా గురు స్థానంలో ఉన్నవారికి, గురు గ్రహానికి పూజ చేయడం అనేక శుభ ఫలితాలనిస్తుంది. ఈ పౌర్ణమి ప్రభావం ఆగస్టులో వచ్చే పౌర్ణమి వరకూ కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఈ పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగంలో శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. అధికారులతో గానీ, సహోద్యోగులతో కానీ ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ అవ కాశాలు లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి సప్తమంలో ఉన్న చంద్రుడితో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల కుటుంబం వృద్ధి చెందు తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయి, ఉన్నత స్థాయి కుటుంబంతో సంబంధం కుదిరే అవ కాశం ఉంది. దాంపత్య సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. కనీ వినీ ఎరుగని మాన సిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని మానసిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. మాతృమూలక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కుతాయి.
  3. కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలకు ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధన లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాట పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
  4. తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో పౌర్ణమి ఏర్పడడం వల్ల ఈ రాశివారి మనసులోని కోరికల్లో అధిక భాగం నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది.
  5. మకరం: ఈ రాశిలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల అనేక రకాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభించడం, హోదా పెరగడం వంటివి జరుగుతాయి. బంధుమిత్రుల నుంచి, పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా బాగా పుంజుకుంటారు.
  6. మీనం: ఈ రాశికి లాభ స్థానంలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగులేని పురోగతి ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయ వంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఓ సంస్థకు ఉన్నతాధికారి అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.