ప్రస్తుతం జీవితంలో చాలా వరకు డబ్బు మీద ఆధాపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి లేకుండా సాఫీగా సాగే జీవితం కావాలనుకుంటారు. అయితే రోజు మొదలు నుంచి రాత్రి నిద్రపోయేవరకు… ఎక్కువ సమయం మనం కేటాయించేది పనిచేసే చోట మాత్రమే.మీరు పనిచేసే చోట డెస్క్ పై ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. జీతం కూడా పెరుగుతుంది.. ఉద్యోగం ఎంత కష్టపడి చేసిన కొందరికి ఆశించినంత ఫలితం రాదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేరు. అలాంటి వారు.. కొన్నిచిట్కాలు పాటించాలి. ఇల్లు, ఆఫీసు, వ్యక్తిగత సంబంధాలు వంటి విషయాల్లో వాస్తు నియమాలు పాటించాలి. వీటిని అనుసరించడం వలన విజయం… సంతోషం పొందవచ్చు. కాబట్టి.. మానసిక ఒత్తిడి మాత్రమే కాకుండా.. కష్టానికి తగిన ప్రతి ఫలం ఉండాలంటే మీరు పనిచేసే కొన్ని వస్తువులు ఉండేలా చూసుకోవాలి. అవి ఎంటో తెలుసుకుందామా.
మీరు పనిచేసే ఆఫీసులో కూర్చునే ప్రదేశంలో ఎప్పుడు శుభ్రత పాటించండి. చాలా సార్లు వ్యక్తులు తమ డెస్క్ పై చాలా వస్తువులను.. కాగితాలను పెడతారు. వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. ఈ అలవాట్లు మీ ఒత్తిడి తగ్గిస్తాయి. అలాగే ఐశ్వర్యం పెరుగుతుంది.
మీరు ఆఫీసులో ఎక్కడ కూర్చున్నా, కాంతి పుష్కలంగా ఉండాలని గుర్తుంచుకోండి. సూర్య కిరణాలు మీపై పడితే అది చాలా మంచిది. అందుకే సూర్యుని కాంతి వచ్చేలా కూర్చోంది.
మీ ఆఫీసులో క్వార్ట్జ్ స్పటికాలను ఉపయోగించడం మంచిది. అలాగే డెస్క్ పై వెదురు మొక్కను ఉంచడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెటింగ్ లేదా సేల్స్‌తో సంబంధం ఉన్నట్లయితే మీరు కూర్చునే సీటు వాయువ్య దిశలో ఉండేలా కూర్చోవాలి. అలాగే మీ ముఖం ఈశాన్య దిశలో ఉంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
మీ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నప్పుడు వాటిని ఏ దిశలో ఉంచాలో గుర్తుంచుకోండి. ఎలక్ట్రానిక్ వస్తువు ఆగ్నేయ మూలలో ఉంచడం కెరీర్ వృద్ధికి మంచిది. టేబుల్ టాప్ పై ల్యాప్ టాప్ వైర్ లేదా కేబుల్ కనిపించకుండా జాగ్రత్త పడాలి.
ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్యల అధికంగా ఉంటుంది. ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు కొన్ని చిట్కాలను పాటించాలి. మీ పని ప్రదేశం పడకగదికి సమీపంలో లేకుండా చూసుకోవాలి. అలాగే రౌండ్ డెస్క్‌లను ఉపయోగించడం మానేయాలి.
అలాగే ఆఫీసుకు ఎక్కువగా నల్లటి దుస్తులు ధరించడం మానేయండి. వాస్తు ప్రకారం నలుపు రంగు చెడుకు గుర్తు. నల్లటి దుస్తులు ధరించడం వలన మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది.