Family Astrology: అనుకూలంగా శుభ గ్రహాలు.. ఆ రాశుల వారికి కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు పరిష్కారం

| Edited By: Janardhan Veluru

Dec 06, 2023 | 8:50 PM

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని రాశుల వారికి కుటుంబపరంగా యోగం పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా సహజ కుటుంబ కారకుడైన శుక్రుడు ప్రస్తుతం స్వస్థానంలో బాగా అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం అవుతోంది. ఇక గురువు స్థానమైన ధనుస్సులో బుధ సంచారం, మిత్రక్షేత్రమైన మేషంలో గురువు సంచారం కూడా కుటుంబజీవితానికి బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు.

Family Astrology: అనుకూలంగా శుభ గ్రహాలు.. ఆ రాశుల వారికి కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు పరిష్కారం
Family Astrology
Follow us on

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని రాశుల వారికి కుటుంబపరంగా యోగం పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా సహజ కుటుంబ కారకుడైన శుక్రుడు ప్రస్తుతం స్వస్థానంలో బాగా అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం అవుతోంది. ఇక గురువు స్థానమైన ధనుస్సులో బుధ సంచారం, మిత్రక్షేత్రమైన మేషంలో గురువు సంచారం కూడా కుటుంబజీవితానికి బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు పరిష్కారం కావడం, కుటుంబంలో ఆగిపోయిన పనులు, శుభకార్యాలు ఊపందుకోవడం, విభేదాలు, అపార్థాలు సమసిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఇది సంపూర్ణంగా వర్తిస్తుంది.

  1. మేషం: ఈ రాశిలో గురువు సంచరించడం, శుక్రుడు సప్తమంలో, బుధుడు సప్తమంలో సంచారం ప్రారంభించడం వల్ల కుటుంబ సమస్యలు చాలావరకు అప్రయత్నంగానే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో తప్పకుండా సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. దాంపత్య జీవితంలో ఎటువంటి పొరపచ్చాలున్నా సమసిపోతాయి. విడాకుల దాకా వెళ్లిన వ్యవహారాలు కూడా సర్దుమణిగే అవకాశం ఉంటుంది. జ్ఞానకారకుడైన గురువు, ప్రేమ కారకుడైన శుక్రుడితో శుభ వీక్షణ కలిగి ఉండడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా చక్కబెట్టడం జరుగుతుంది. కుటుంబ సమస్యలను, దాంపత్య సమస్యలను ఆత్మవిమర్శతో, రాజీమార్గంతో పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు ఏ స్థాయిలో ఉన్నా పెద్దల జోక్యంతో తప్పకుండా పరిష్కారం అయి, కుటుంబ జీవితం చక్కబడుతుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరు ఉన్నత పదవులు అందుకుంటారు.
  3. కన్య: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్రుడు, సుఖ స్థానంలో బుధుడు సంచారం చేయడం, ఈ రెండు గ్రహాలను గురువు వీక్షించడం వల్ల కుటుంబ జీవితం మునుపెన్నడూ లేనంత ఆనందంగా ముందుకు సాగుతుంది. కుటుంబానికి అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పడడంతో పాటు, విహార యాత్రలకు, తీర్థ యాత్రలకు వెళ్లడం కూడా జరుగుతుంది. దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు వృద్ధి చెందుతాయి. అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య పెరుగుతుంది. కుటుంబం ఆర్థికంగా బలం పుంజుకుంటుంది. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటుంది.
  4. తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు, ఈ రాశిలో శుక్రుడు సంచరించడం కుటుంబ జీవితాన్ని మంచి దశకు తీసుకువెడుతుంది. ముఖ్యంగా అనేక విధాలుగా సుఖ సంతోషాలలో ముంచెత్తు తుంది. కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా సునాయాసంగా తొలగిపోతాయి. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సమస్యలున్నప్పటికీ సమయస్ఫూర్తిగా వాటిని పరిష్కరించు కోవడం జరుగుతుంది. పిల్లలు తగినంత చదువుల్లో శ్రద్ధ చూపించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు.
  5. ధనుస్సు: ఈ రాశిలో బుధుడు, పంచమంలో గురువు, లాభస్థానంలో శుక్రుడు సంచరించడం ఈ రాశివారికి కుటుంబపరంగా అనేక యోగాలను కలిగిస్తాయి. కుటుంబ వృద్ధికి, సంతాన యోగానికి, ధన వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లో పైకి రావడం లేదా మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం వంటివి జరుగుతాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ప్రదేశాలకు, ఇష్టమైన ఆలయాలకు వెళ్లడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు.
  6. మకరం: ఈ రాశికి సుఖ స్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోవడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా స్థిరత్వం లభించడం, ఆదాయం పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు చదువుల్లో గానీ, వృత్తి, ఉద్యోగాల్లో గానీ మంచి గుర్తింపు తెచ్చుకోవడం, విజయాలు సాధించడం జరుగుతుంది. కుటుంబసమేతంగా దూర ప్రయాణాలు లేదా విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.