Dhana Yoga: మీన రాశిలో బుధుడు, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి ధన యోగాలు పక్కా..!

| Edited By: Janardhan Veluru

Mar 02, 2024 | 7:52 PM

ఈ నెల 8 నుంచి బుధుడు మీన రాశిలో నీచబడడం జరుగుతోంది. పైగా, అక్కడ రాహువుతో కలవడం జరుగుతోంది. ఈ గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులకు యోగం పట్టే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, కుంభం, మీన రాశుల వారికి బుధుడు నీచబట్టడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో మిథున, కన్యారాశులకు బుధుడు అధిపతి అయినప్పటికీ కేంద్ర స్థానంలో ఉన్నందువల్ల నీచభంగం అయింది.

Dhana Yoga: మీన రాశిలో బుధుడు, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి ధన యోగాలు పక్కా..!
Money
Follow us on

ఈ నెల 8 నుంచి బుధుడు మీన రాశిలో నీచబడడం జరుగుతోంది. పైగా, అక్కడ రాహువుతో కలవడం జరుగుతోంది. ఈ గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులకు యోగం పట్టే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, కుంభం, మీన రాశుల వారికి బుధుడు నీచబట్టడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో మిథున, కన్యారాశులకు బుధుడు అధిపతి అయినప్పటికీ కేంద్ర స్థానంలో ఉన్నందువల్ల నీచభంగం అయింది. ఈ నీచ బుధుడు రాహువుతో కలవడం వల్ల రాజయోగంతో కూడిన ధన యోగం పట్టే అవకాశం ఉంటుంది. ఈ నెల 27వ తేదీ వరకూ బుధుడు మీన రాశిలో, నీచ స్థితిలో కొనసాగుతాడు.

  1. వృషభం: ఈ రాశికి ధనాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో నీచపడినప్పటికీ రాహువుతో చేరడం వల్ల తప్పకుండా లక్ష్మీ యోగం పడుతుంది. ఈ రాశివారిలో ధన కాంక్ష విపరీతంగా పెరిగి అనేక విధా లుగా సంపాదించడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. లాభదాయక మైన పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి కోలుకో వడం జరుగుతుంది. ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. శుభవార్తలు వింటారు.
  2. మిథునం: ఈ రాశ్యధిపతి బుధుడు దశమ కేంద్రంలో నీచపడినప్పటికీ అది భంగం అయింది. ఫలితంగా నీచ భంగ రాజయోగం ఏర్పడింది. వృత్తి, ఉద్యోగాల్లో గతంలో ఎన్నడూ లేని పురోగతి ఉంటుంది. జీత భత్యాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా రాబడి వృద్ధి చెందుతుంది. సంపద పెరుగుతుంది. ఈ నెల వరకూ రాజయోగంగా గడిచిపోతుంది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో అంచనాలకు మించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇది మంచి సమయం.
  3. కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధ, రాహువులు కలవడం వల్ల విదేశాలకు సంబంధించిన పనులు, ప్రయత్నాలు, వ్యవహారాలన్నీ విజయవంతం అవుతాయి. విదేశీ సొమ్మును అనుభ వించే యోగం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు సైతం విదేశీ ఆఫర్లు అందుతాయి. పితృమూలక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాలను సందర్శించడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
  4. కన్య: ఈ రాశ్యధిపతి అయిన బుధుడు సప్తమ కేంద్రంలో నీచబడినప్పటికీ నీచభంగం అయి, నీచభంగ రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. వ్యక్తిగతంగా కూడా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. ధన ధాన్య వస్తు లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించడం జరుగుతుంది.
  5. కుంభం: ఈ రాశికి ధన స్థానంలో బుధ, రాహువులు కలవడం వల్ల ఈ రాశివారికి సంపాదన బాగా పెరు గుతుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెర గడంతో పాటు అదనపు రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ధన సంబంధమైన ప్రయత్నా లన్నీ విజయవంతం అవుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతో షాలు వెల్లివిరుస్తాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  6. మీనం: ఈ రాశిలో బుధుడు నీచబడినప్పటికీ నీచభంగం అయి, అదృష్టం పడుతుంది. రాజయోగంతో పాటు ధన యోగానికి కూడా అవకాశం ఉంది. సామాజికంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వారితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో విశేషంగా లాభాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరుగు తాయి.