
దిన ఫలాలు (మే 14, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మిథున రాశి వారికి ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. శరీరానికి విశ్రాంతి ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. బంధుమిత్రుల తోడ్పాటుతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొద్దిపాటి శ్రమతో అధిక లాభం పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఆర్థిక విషయాల్లో అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే, మిగిలిన అన్ని అంశాలూ సానుకూలపడతాయి. ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా డిమాండ్ పెరిగి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం చాలా మంచిది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికీ ఎటు వంటి వాగ్దానాలూ చేయవద్దు. బాగా దగ్గరివారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే సూచనలున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు భారీగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాలు మార్చుకుంటారు. సన్నిహితుల నుంచి ఉద్యోగ సంబంధంగా కీలక సమాచారం అందుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య కార్యంలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు, కొత్త ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడతాయి.
కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం మంచిది. మిత్రులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. ఆస్తి సంబంధమైన వివాదం నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దు. అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.
ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ ఏర్పడుతుంది. పాత విషయాలు తలచుకుని బాధ పడడం మంచిది కాదు. వీలైనంతగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ బాధ్యతల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.
ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. వృత్తి, వ్యాపారాలలో సంపాదన పెరుగుతుంది. ప్రయాణాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి విలువ పెరగవచ్చు. కొత్త ఆస్తుల మీద దృష్టి పెడతారు. సంపాదనపరంగా కొత్త పథకాల గురించి ఆలోచిస్తారు. రోజులో నిమిషం కూడా తీరిక ఉండదు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.
ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు అందు కుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన అనుకూలత కలుగుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ముఖ్యమైన పనులు బాగా నిదానంగా పూర్తి చేస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో హోదా, స్థాయి పెరుగుతాయి. వ్యాపారాల్లో అనేక విధాలుగా లాభాలు అందుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అయి ఊరట చెందుతారు. అవసర సమయాల్లో స్నేహితులు అండగా నిలబడతారు. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రయత్నాలు ఆశించిన శుభ ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి.
ఉద్యోగరీత్యా ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
కుటుంబ పెద్దల అనారోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో చిన్నాచితకా సమస్యలుంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లాభాలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బరువు బాధ్యతలతో విశ్రాంతి తక్కువవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాల్లో ప్రస్తుతానికి కాస్తంత తగ్గి ఉండడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సహోద్యోగులు ఆశించినంతగా సహకరించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.