Horoscope Today (14 ఏప్రిల్ 2023 ): తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి శుక్రవారం.. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
కొద్దిగా అదృష్ట యోగం పడుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగుతాయి.
రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారులు కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఇందులో పాల్గొంటారు. వృత్తి నిపుణులు ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభ వార్త వింటారు.
అవసరానికి తగిన డబ్బు అందుతుంది. ఒక కీలకమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగపరంగా రోజంతా సాఫీగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విదేశాల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాల వారు మరింత శ్రద్ధ పెంచవలసి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు, ఐటీ రంగం వారు, ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది.
ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది కానీ కుటుంబ పరంగా కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. బంధువుల కారణంగా కొన్ని సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి.
ఉద్యోగానికి సంబంధించి మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. నిరుద్యోగులు కూడా శుభవార్త వింటారు. పిల్లల్లో ఒకరు చదువు లేదా ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత కనిపిస్తుంది.
ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.
ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా అంతా బాగానే ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. బంధువులు కొద్దిగా ఒత్తిడి తెస్తారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.
అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధంగా దూరప్రాంతం నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంలో చేరటం జరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మొండి బకాయి వసూలు అయి, ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కొందరు మిత్రులు అండగా నిలబడతారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. సహచరులు బాగా సహకరిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను శ్రద్ధగా పూర్తి చేస్తారు. మొండి బకాయి ఒకటి వసూలు అవుతుంది. వ్యాపార భాగస్వాములతో ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించుకుంటారు. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. నమ్మకద్రోహానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం పెరగటానికి కూడా అవకాశం ఉంది. మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు చిన్న పాటి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
ఆస్తికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. అన్నదమ్ములతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ పరంగా బరువు బాద్యతలు పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండవు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..