సెప్టెంబర్ 20 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుడ్‌న్యూస్

Horoscope Today (September 20, 2026): ఆదివారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులతో పాటు వ్యాపారంలో లాభాలు కలిసివచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కుటుంబపరమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉండటంతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మిథున రాశి వారు సొంత పనులపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిగతా రాశుల వారికి ఆదివారం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే పూర్తి రాశిఫలాలు చూడండి.

సెప్టెంబర్ 20 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుడ్‌న్యూస్
Rashi Phalalu 20 September 2026

Edited By:

Updated on: Sep 20, 2026 | 6:00 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 20, 2026): మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి కుటుంబపరంగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మిథున రాశి వారికి సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఉండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. రాజకీయ ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్త వుతాయి. కుటుంబపరంగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దగ్గర బంధు వులతో అపార్థాలు తలెత్తుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఉండదు. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. జీతభత్యాల విషయంలో ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపో తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులతో సానుకూలతలు పెరుగుతాయి. చిన్నా చితకా సమస్యలు పరిష్కారమ వుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆస్తి వివాదం సమసిపోతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృథా ప్రయా ణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. రావలసిన డబ్బును, బాకీలను పట్టు దలగా వసూలు చేసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుం టారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ విషయంలో కీలక నిర్ణ యాలు తీసుకునే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల పరిస్థితి లాభాలపరంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో కార్యిసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రు లతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. మిత్రుల నుంచి ఆశిం చిన శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేస్తారు. విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమ ఎక్కువగానే ఉన్నా వాటినన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. అనుకున్నవి అనుకున్నట్టు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. ఆదాయం పెరిగి, కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్న నాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగాల్లో అధికారుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆదాయా నికి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆర్థిక వ్యవ హారాల్లో ఆశించిన విధంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అత్యవసర ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధు వుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలతో పాటు శ్రమాధిక్యత ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సర దాగా కాలక్షేపం చేస్తారు. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారాల్లో రాబడికి పెరుగుతుంది. విద్యార్థులకు పరవాలేదు.

Also Read: వారఫలాలు: ఈ వారం ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్..!

Loading...
Unable to load recommendations.
Follow Us