Horoscope Today 06th September 2023
Horoscope Today (06th Sep): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం (సెప్టెంబరు 6న) 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. దానధర్మాలు చేసే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు గడిస్తారు. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. మంచి స్నేహితులు ఏర్పడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ ఆలోచనలకు, వ్యూహాలకు విలువ పెరుగుతుంది. వివాదాలు, సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రోజంతా హాయిగా గడిచిపోతుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం, సామరస్యం పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబ అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): విదేశాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబడతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం గానీ, ఇంక్రిమెంట్ పెరగడం గానీ జరుగు తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి డిమాండ్, సంపాదన పెరు గుతాయి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చుల్ని అదుపు చేయడం కష్టమవుతుంది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటుండదు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించేవారికి సమయం అనుకూలంగా ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరికీ ఆకట్టుకుంటారు. వృత్తి రంగంలో మీరను కున్నది సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. కొత్తవారితో స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయ త్నాలు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో సామరస్యం ఏర్పడుతుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మీ ఆలోచనలు, వ్యూహాలు విజయవంతం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తి కరంగా, సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సాను కూలపడతాయి. పిల్లల చదువుల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పరవాలేదు.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. శత్రువులు కూడా మిత్రు లుగా మారుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు బాగా నచ్చుతాయి. వృత్తి రంగంలో మంచి గుర్తింపు లభించి సంపాదన పెరుగుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ఆరోగ్యం బాగుంటుంది.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తి స్తారు. దైవ కార్యాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. దైవ కార్యాలు, సహాయ, వితరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరు ద్యోగుల ప్రయత్నాలే కాక, అవివాహితుల ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.