
దిన ఫలాలు (నవంబర్ 1, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. మిథున రాశి వారు వృత్తి, వ్యాపారాలు విజయవంతం అయ్యేలా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికంగా కూడా అనుకోని స్థిరత్వం లభిస్తుంది. అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఎదురుచూస్తున్న శుభవార్త అందుతుంది. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా విశ్రాంతి కరువవుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. బంధుమిత్రులలో కొందరికి అండగా నిలబడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు విజయవంతం అయ్యేలా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ముఖ్య మైన వ్యవహారాలు, పెండింగ్ పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు వృద్ధి చెందు తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడా నికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు, షేర్లు బాగా లాభిస్తాయి డబ్బు విషయాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి స్నేహాలు కలుగుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
ఆదాయం, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. లాభాల విషయంలో వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొందరు ఉద్యోగులు చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించడం గానీ, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం గానీ జరిగే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరం.
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో, శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. కొత్త వ్యాపారాల మీద దృష్టి సారిస్తారు. ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పిల్లల పురో గతికి సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. విదేశాల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దీర్ఘ కాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు, ఇతర ముఖ్య మైన పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యో గంలో బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. కొందరు బంధువుల కారణంగా ఆర్థిక సమస్యలకు లోనవుతారు. కొద్దిగా ఓర్పుగా వ్యవహరిస్తే ఇంటి వ్యవహారాలు సజావుగా పరిష్కారమవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
ఉద్యోగంలో మాట చెల్లుబాటవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఏ రంగానికి చెందినవారికైనా సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవు తుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉత్తమ ఫలితాలనిస్తాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. కుటుంబ వ్యవహా రాలు చక్కబడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. బాధ్యతల విషయంలో కొన్ని సాను కూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు పని చేస్తాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృథా ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాలకు ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాలు ఒత్తిడి కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులు, అవివాహితుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోతారు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ మీద అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు చాలావరకు సమసిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రస్తుతానికి కొత్త ప్రయ త్నాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.