Horoscope Today: ఈరోజు కొన్ని రాశులవారు అనుకున్న పనులు జరగాలంటే కష్టపడాల్సి ఉంది.. వారు ఏం చేయాలంటే..!

|

Mar 27, 2021 | 6:47 AM

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి..

Horoscope Today: ఈరోజు కొన్ని రాశులవారు అనుకున్న పనులు జరగాలంటే కష్టపడాల్సి ఉంది.. వారు ఏం  చేయాలంటే..!
Today Rashiphalalu
Follow us on

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్చి 27 శుక్రవారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి:
ఈ రాశివారు ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంది. పేదవారికి అన్నదానం చేయడం వలన మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు.

వృషభ రాశి:
ఈ రాశివారు స్థిర చరాస్థి క్రయవిక్రయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగాది విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. దక్షిణామూర్తిస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మిధున రాశి:
ఖర్చులు పెరుగుతుంటాయి. శక్తిమించినటు వంటి పనులు చేపట్టి ఇబ్బందులు పడుతుంటారు.. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం పారాయణం మంచిది.

కర్కాటక రాశి:
ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విందు వినోదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాల్లో పలు పూజా ద్రవ్యాలు సమకూర్చే పని చేయండి..

సింహ రాశి:
ఈరోజు కుటుంబ పరమైన కార్యక్రమాలు చేపట్టి విశేషంగా పూర్తి చేస్తుంటారు. వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన చేస్తుంటారు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. మూగజీవాలకు ఆహారం సమర్పణ చేసుకునే ప్రయత్నం చేయండి.

కన్య రాశి:
ఈ రాశివారు ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తి అవుతుంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీ రాజరాజేశ్వరి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తులా రాశి:
ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతుంటాయి. వీరు చేపట్టినటువంటి పనులు పూర్తి చేసుకోవడంలో కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు చక్కగా . ఈ రాశివారు మహాలక్ష్మీ వారికి చక్కర పొంగలి నివేదించడం మంచిది.

వృశ్చిక రాశి:
ఈరోజు చేపట్టిన పనులు వాయిదాపడే అవకాశం ఉంది.. అటువంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ రాశి వారికి గౌరీ శంకర అర్చన శుభఫలితాలను అందజేస్తుంది.

ధనుస్సు రాశి:
ఈరోజు కొత్తపనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తుంటారు. శుభవార్తలు ఆనందాన్ని కలుగజేస్తుంటాయి. ఇంద్రాణీ స్తోత్ర పారాయణం శుభఫలితాలను కలుగజేస్తుంది.

మకర రాశి:
ఈ రాశివారు వేరువేరు రూపాల్లో చేపట్టిన పనుల వలన అధిక శ్రమ పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సహస్రనాన స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి:
ఈ రాశి వారికీ ఈ రోజు ఆర్ధిక ప్రగతి ఏర్పడుతుంది. విందు వినోదాలు ఉంటాయి. ప్రయాణాలు ఏర్పడే సందర్భం ఉంటుంది. నారాయణ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. వడపప్పు పానకం శ్రీవారికి నివేదన చేయండి.

మీన రాశి:
ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక విషయంలో నిరుత్సాహం కనిపించినా అంతగా నష్టాలు కలగపోవచ్చు. ప్రతి విషయంలోనూ పట్టుదలతో వ్యవహరించండి.. ఇబ్బందులను చక్కగా అధిగమించగలుగుతారు. మహా గణపతి దర్శనం సింధూర రక్ష చక్కని శుభఫలితాలను కలుగజేస్తుంది.

Also Read: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా దుల్కర్ సల్మాన్.. ఆకట్టుకుంటున్న కురుప్ టీజర్

 హోళీ కేళీ వచ్చేసింది.. దేశ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా రంగోలి సంబురాలు..