
దిన ఫలాలు (ఫిబ్రవరి 21, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మాట తొందర వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా నిలకడగా పురోగమిస్తాయి. మాట తొందర వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఎవరితోనైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా సాగిపోతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రతిఫలానికి లోటుండదు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. పిల్లలు విజయాలు సాధిస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు ఇష్టమైన మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.
ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టడం జరుగుతుంది. సొంత పనుల విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇతరుల బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తి కరంగా పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమం. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు మీద పడతాయి.
ఉద్యోగంలో బాధ్యతలు మారిపోతాయి. వ్యాపారాలు బిజీగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు సన్నిహితులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. చేపట్టిన పనులు చాలావరకు సఫలం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పోటీదార్లతో ఇబ్బందులున్నప్పటికీ లాభాలకు లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. మనసు లోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి.
ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్ప కుండా నెరవేరుతుంది. బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. కొన్ని ప్రత్యేక బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆక స్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.
ఉద్యోగం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు చాలావరకు తగ్గుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఒకరిద్దరు బంధువులకు వీలైనంత సహాయం చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.