Daily Horoscope: వారి వృత్తి, ఉద్యోగాలకు ఢోకా లేదు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..!

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 24, 2023 | 6:11 AM

Horoscope Today in Telugu(August 24): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 24, 2023న(గురువారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Daily Horoscope: వారి వృత్తి, ఉద్యోగాలకు ఢోకా లేదు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..!
Horoscope 24th August 2023
Follow us on

Horoscope Today in Telugu(August 24): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 24, 2023న(గురువారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. ఏ విషయంలోనూ నిరాశా నిస్పృహలకు లోను కావద్దు. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలున్నా వాటిని తేలికగా పరిష్క రించుకుంటారు. ఆదాయానికి
ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఒకటికి రెండు సార్లు గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి లోటు లేదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, వ్యాపారాల్లో మీరు తలపెట్టిన మార్పులు, మీరు చేసే ఆలోచనలు చక్కని ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో నలుగురు చేసే పనిని మీరు ఒక్కరే చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని పక్కన పెట్టడం మంచిది కాదు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది కానీ, దానధర్మాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): లాభ స్థానంలో ఉన్న గురువు బాగా ఆదాయం పెంచుతాడు కానీ, అదే స్థానంలో ఉన్న రాహువు దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టిస్తాడు. డబ్బు దాచుకునే ప్రయత్నాలను రాహువు సాగనివ్వడు. ఏ ఉద్యోగం కోసం ప్రయత్నించినా అది సఫలం అయ్యేటట్టుగా సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలోని ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి జీవితంలో మీరు గట్టిగా ప్రయత్నించకుండానే రాబడి పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ప్రస్తుతానికి వృత్తి, ఉద్యోగాలకు ఢోకా లేదు. గురువు అనుగ్రహంతో పాటు
శుక్రుడి అనుగ్రహం కూడా బాగా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది కానీ, వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం ఒత్తిడి, శ్రమ కనిపించవు. కుటుంబ సభ్యులు ఒకపట్టాన కలిసి రారు. కొద్దిగా మనశ్శాంతి తగ్గు తుందనిపిస్తోంది.
అష్టమ శని వల్ల ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఏదో ఒక అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాస్తంత విశ్రాంతి తీసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): డబ్బు విషయంలో కొద్దిగా జ్ఞానోదయం అవుతుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు పడడం ప్రారం భిస్తారు. ఉద్యోగంతో నిమిత్తం లేకుండా మరింతగా డబ్బు సంపాదించడం మీద దృష్టి పెడతారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు బాగానే ఉంటాయి. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తులవారికి సంపాదన బాగానే ఉంటుంది. సరిగ్గా ప్రయత్నిస్తే నిరుద్యోగ సమస్య దూరమైపోతుంది. పెళ్లి ప్రయత్నాలకేమీ లోటు ఉండదు కానీ, అవతలి వారి నుంచి స్పందన లభించక ఇబ్బంది పడతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఏదో విధంగా డబ్బు సమకూరుతూ ఉంటుంది కానీ, అది నీళ్లలా ఖర్చవుతుంటుంది. ఉద్యోగంలో చాకిరీ పెరుగుతుంది. సరైన ప్రతిఫలం మాత్రం ఉండదు. ఆదాయపరంగా వృత్తి, వ్యాపారాల మీద ఆధారపడవచ్చు. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. డబ్బు తీసుకున్నవాళ్లు ముఖం చాటేస్తుంటారు. కుటుంబంలో అవసరాలు పెరిగి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులు ఏదో ఒక చిన్న ఉద్యోగంతో
సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ప్రయత్నాలన్నీ చక్కగా కలిసి వస్తాయి. డబ్బుకేమీ లోటు ఉండదు. కానీ, స్నేహితులతో విందులు, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాగా కష్టపడతారు, అధి కారులను మెప్పిస్తారు. వ్యాపారంలో కొత్త కొత్త ఐడియాలను ప్రవేశపెడుతుంటారు. అవి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి కానీ, వాటిని సక్ర మంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైవింగ్ లో స్పీడును పెంచడం మంచిది కాదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): డబ్బు సంపాదన గురించి ఎన్నో ఆలోచనలుంటాయి కానీ, వాటిని సరిగ్గా ఆచరణలో పెట్టలేక పోతుంటారు. ఒకపక్క ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. శుభ కార్యాలు సైతం పెండింగులో పడు తుంటాయి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా, ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కూడా సాదా సీదాగా సాగిపోతుంటాయి. అర్ధా‌ష్టమ శని ఒకదాని తర్వాత ఒకటిగా ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూ ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రోజంగా సానుకూలంగా సాగిపోతుంది. రకరకాలుగా అదృష్టం పడుతూ ఉంటుంది. ఒకసారి ఉద్యోగ పరంగా, మరోసారి కుటుంబపరంగా కలిసి వస్తూ ఉంటుంది. మొత్తం మీద ఆదాయానికి, ఆరోగ్యా నికి ఢోకా ఉండదు. ఉద్యోగంలో కూడా మీ మాటే చెల్లుబాటు అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒక్క క్షణం విశ్రాంతికి కూడా అవకాశం ఉండదు. ఏ పని చేసినా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగిపోతుంది. అన్ని విషయాల్లోనూ జీవిత భాగస్వామి చేదోడు వాదోడుగా ఉంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): డబ్బు సమస్యలుండవు కానీ, ఖర్చు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనికితోడు మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం కూడా చేస్తుంటారు. అనవసర వ్యవహారాలు,
అనవసర పరిచ యాలు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో మోయలేని భారాన్ని కూడా మోసేస్తుంటారు. ప్రతి ఫలం గురించి ఆలోచించరు. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల్లో కూడా ఉచిత సేవలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యాన్ని శాయశక్తులా కాపాడుకుంటుంటారు. కుటుంబంలో ఆనందానికి లోటుండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): శనీశ్వరుడి ప్రభావం వల్ల ‘బండ చాకిరీ’ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వృత్తిలో ఉన్న శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదార్ల సంఖ్య ఎక్కు వగా ఉన్నా రాబడికి లోటుండదు. ఏదో విధంగా డబ్బు సంపాదిస్తారు కానీ, దాన్ని నిలబెట్టు కోవడం ఒక సవాలుగా మారుతుంది. నిరుద్యోగులు తమ చదువులకు ఏమాత్రం సంబంధంలేని ఉద్యోగాలతో సర్దుకుపోవాల్సి వస్తుంది. మధ్య మధ్య ఏదో ఒక శుభవార్త అందుతుంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కుటుంబ సభ్యులకు సంబంధించి, జీతభత్యాలకు సంబంధించి మధ్య మధ్య శుభవార్తలు చెవిన పడుతుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు మాటలతో మిమ్మల్ని అందలాలు ఎక్కిస్తుం టారు. రకరకాలు డబ్బు సంపాదిస్తుంటారు. వాటిని దైవ కార్యాల్లో, శుభ కార్యాల్లో ఖర్చు పెట్టేస్తుం టారు. వ్యయ స్థానంలో
వక్రించి ఉన్న శనీశ్వరుడు ఒక పట్టాన డబ్బు మిగల్చడు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. పిల్లల నుంచి వినవచ్చిన శుభవార్తలు ఆనందపెడతాయి.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.