Horoscope Today: వారికి లాభసాటిగా వృత్తి, వ్యాపారాలు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Aug 14, 2023 | 5:01 AM

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 14, 2023న(సోమవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today:  వారికి లాభసాటిగా వృత్తి, వ్యాపారాలు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు..
Horoscope 14th August 2023
Follow us on

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 14, 2023న(సోమవారం) మేషం, వృషభం, మిథునం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి సంబంధమైన లాభాలు చేతికి అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. మిత్రుల సహాయ సహఃకారాలతో కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణా లకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు ఆశించిన ప్రతిఫలం అందుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. కుటుంబ సభ్యులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల విషయంలో కొత్త ఆలోచనలను ఆచరణలో పెడతారు. స్థిరాస్తి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. తోబు ట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది.
నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు
చేతికి అందు తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకా రాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ధనాదాయం చాలావరకు బాగుంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి అందిన సమా
చారం ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో వివాదాలు, అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్య మైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు అందుతాయి. వ్యాపారాన్ని విస్తరించడం గానీ, పెట్టుబడులు పెంచడం గానీ జరుగుతుంది. వృత్తి జీవితానికి సంబంధించి కొత్తవారు పరిచయమవుతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, భూమి క్రయ
విక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొం టారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు, ఆటంకాలు కలిగినప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రోజంతా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి,
ఉద్యోగాల కారణంగా ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యాపారపరంగా ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో శుభ వార్తలు అందుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా
సాగిపోతుంది. స్థిరా స్తికి సంబంధించిన క్రయ విక్రయాల్లో ఒప్పందాలు కుదర్చుకుంటారు. పితృ వర్గం నుంచి ఊహిం చని సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అయి, కాస్తంత మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఒక ప్రధానమైన కుటుంబ పరిష్కారం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రోజంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితు లతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణతో హోదాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చదువుల్లో పిల్లలకు అండగా ఉంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి రీత్యా ప్రయాణాల సందర్భంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పు వస్తుంది. రావల సిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. పిల్ల లకు సంబంధించిన చదువులు, ఉద్యోగాలు, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమ స్యలు చాలా వరకు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా ముందుకు వెడతాయి.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి