Budhaditya Yoga: వృశ్చిక రాశిలో రవి, బుధుల కలయిక.. బుధాదిత్య యోగంతో ఆ రాశుల వారికి అదృష్టం!

| Edited By: Janardhan Veluru

Nov 21, 2023 | 6:58 PM

Budhaditya Yoga 2023: వృశ్చిక రాశిలో రవి, బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. ఈ యోగం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులకు ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. సమయ స్ఫూర్తి, తెలివితేటలు, ఆకస్మిక ధన లాభం, వ్యవహార విజయం, వివాదాల పరిష్కారం, కేసుల్లో గెలుపు వంటివి ఈ బుధాదిత్య యోగం లక్షణాలు.

Budhaditya Yoga: వృశ్చిక రాశిలో రవి, బుధుల కలయిక.. బుధాదిత్య యోగంతో ఆ రాశుల వారికి అదృష్టం!
Budhaditya Yoga 2023
Follow us on

వృశ్చిక రాశిలో రవి, బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. ఈ యోగం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులకు ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. సమయ స్ఫూర్తి, తెలివితేటలు, ఆకస్మిక ధన లాభం, వ్యవహార విజయం, వివాదాల పరిష్కారం, కేసుల్లో గెలుపు వంటివి ఈ బుధాదిత్య యోగం లక్షణాలు. ఈ ఎనిమిది రాశుల వారికి ఇందులో అన్నీ గానీ, కొన్ని గానీ తప్పకుండా వర్తిస్తాయి. ఏయే రాశుల వారికి ఏ విధంగా ఈ యోగం శుభ ఫలితాలను ఇస్తుందో ఇక్కడ చూద్దాం.

  1. వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ యోగం ఏర్పడినందువల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇతరుల వివాదాలను కూడా ఈ రాశివారు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతిభా పాటవాలు బాగా ప్రకాశించే లేదా అక్కరకు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక సంబంధమైన వివాదాలు తొలగిపో తాయి. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సతీమణి ఆకస్మిక ధనలాభం పొందుతారు.
  2. కర్కాటకం: ఈ రాశివారికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం అదృష్టదాయకం. జీవితంలో కనీ వినీ ఎరుగని పురోగతికి అవకాశం ఉంది. ఈ రాశివారికి ప్రతిభా పాటవాలు, ఆలోచనలు, సూచనలు అధికారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ఉన్నతస్థాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పాజిటివ్ దృక్పథం అలవడుతుంది.
  3. సింహం: ఈ రాశివారికి నాలుగవ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల, వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంటుంది. అధికారులకు బాగా నమ్మకం పెరుగుతుంది. గృహ, వాహన సౌక ర్యాలు వృద్ధి చెందుతాయి. రాజకీయంగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
  4. తుల: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం పట్టడం వల్ల సంపాదన పెరగడానికి, ఆర్థిక ప్రయ త్నాలు ఫలించడానికి, రావలసిన డబ్బు చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఒకటి రెండు ముఖ్యమైన కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. సతీమణితో అన్యోన్యత పెంపొందుతుంది. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
  5. వృశ్చికం: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభా పాటవాలు అనేక విధాలుగా లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలోనే కాకుండా, సామాజికంగా, కుటుంబ పరంగా కూడా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను సమయ స్ఫూర్తితో పరిష్కరించుకోవడం జరుగుతుంది. మనసులోని కోరికలు అత్యధిక భాగం నెరవేరు తాయి. ఆరోగ్య సమస్యలకు సరికొత్త పరిష్కారం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  6. మకరం: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధ, రవులు కలవడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. లాభసాటి అయిన పరిచయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరించడానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు కలసిరావడం, ఆకస్మిక ధన లాభం పట్టడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది.
  7. కుంభం: ఈ రాశికి దశమంలో, అంటే ఉద్యోగ స్థానంలో రవి, బుధుల కలవడం వల్ల తప్పకుండా అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా పురోగతి ఉంటుంది. తెలివి తేటలు బాగా రాణిస్తాయి. అధికారులకు అనేక విధాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా ప్రాభవం ఏర్పడుతుంది. ఏ రంగంలోని వారైనా తిరుగులేని విజయాలు సాధిస్తారు.
  8. మీనం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న ఉద్యోగులు, వృత్తి నిపుణులకు స్థిరత్వం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విరివిగా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. దైవ కార్యాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశి వారి ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..