Budhaditya Yoga: త్వరలో ఆ రాశులవారికి బుధాదిత్య యోగం.. వ్యక్తిగత, కుటుంబ సమస్యలన్నీ మాయం..

| Edited By: Janardhan Veluru

Mar 03, 2023 | 4:29 PM

ప్రస్తుతం రవి బుధులు కుంభరాశిలో కలిసి ఉన్నాయి. ఈ నెల 15 తర్వాత మీన రాశిలో ప్రవేశిస్తాయి. అక్కడ కూడా ఒక నెల రోజుల పాటు కలిసే ఉంటాయి. ఈ కలయిక కారణంగా..

Budhaditya Yoga: త్వరలో ఆ రాశులవారికి బుధాదిత్య యోగం.. వ్యక్తిగత, కుటుంబ సమస్యలన్నీ మాయం..
Budhaditya Yoga
Image Credit source: TV9 Telugu
Follow us on
Telugu Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, సూర్యుడు కలిసే యోగాన్ని బుధాదిత్య యోగం అంటారు. ఈ యోగం ఒక విచిత్రమైన యోగం. జాతక చక్రంలో బుధరవులు కలిసి ఉంటే ఆ జాతకుడు బాగా తెలివైన వాడనీ, చదువులోనూ, ఆ తరువాత ఉద్యోగంలోనూ బాగా రాణిస్తాడని చెప్పాల్సి ఉంటుంది. బుధాదిత్య యోగాన్ని సూక్ష్మ బుద్ధి యోగం అని కూడా అంటారు. గ్రహ సంచారంలో కూడా తరచూ ఈ రెండు గ్రహాలు కలిసే అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని రాశుల వారు సమస్యల నుంచి బయటపడ టానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రవి బుధులు కుంభరాశిలో కలిసి ఉన్నాయి. ఈ నెల 15 తర్వాత మీన రాశిలో ప్రవేశిస్తాయి. అక్కడ కూడా ఒక నెల రోజుల పాటు కలిసే ఉంటాయి. ఈ కలయిక వల్ల వృషభం, మిధునం, సింహం, మకరం, కుంభరాశు లకు కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్యల నుంచి బయట పడటానికి మాత్రమే ఈ యోగం చక్కగా పనిచేస్తుంది. ఈ అద్భుత యోగం వల్ల ఈ రాశుల వారు ఏ విధంగా ప్రయోజనం పొందబోతున్నదీ పరిశీలిద్దాం.
వృషభ రాశి
ఈ రాశి వారికి 10, 11 రాశుల్లో బుధాదిత్య యోగం పట్టబోతోంది. ఉద్యోగ పరంగా, సంపా దనపరంగా ఉన్న సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం లేదా ఇంక్రిమెంట్లు పెరగటం, బకాయిలు వసూలు కావటం వంటివి అనుభవంలోకి వస్తాయి. ఉద్యోగంలో అధికార యోగం చేపట్టడా నికి అడ్డుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.  వృత్తి, వ్యాపారాల్లో కూడా పురోగతికి, లాభా ర్జనకు, విస్తరణకు సంబంధించిన అవరోధాలు పక్కకు తప్పుకుంటాయి.
మిథున రాశి
ఈ రాశి వారికి 9, 10 రాశుల్లో ఈ యోగం పడుతుంది. దీనివల్ల విదేశీ ప్రయాణాలకు లేదా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఎదురవు తున్న సమస్యలు వాటి అంతటవే పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. సంతానానికి సంబంధించిన చిన్నాచితకా సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా సానుకూలంగా పరిష్కార మయ్యే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం బాగా మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. అడ్డంకులు, అవరోధాలు తొలగిపోయి ప్రశాంతంగా జీవితం గడుపుతారు.
సింహ రాశి
సింహ రాశి వారికి సప్తమ, అష్టమ రాసుల్లో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీనివల్ల వివాహ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు, విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు, వివాదాలు, అపార్ధాలు ఉన్న పక్షంలో అవి బంధువుల జోక్యంతో పరిష్కారం అయిపో తాయి. పెళ్లి కాని వారు ఒక ఇంటి వారయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి.
మకర రాశి
ఈ రాశి వారికి రెండు, మూడు స్థానాల్లో ఈ యోగం పట్టడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలతో పాటు ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలకు కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. ఇందులో రెండవ స్థానం ధన, కుటుంబ స్థానం కాగా మూడవ స్థానం ఉద్యోగానికి, పురోగతికి సంబంధించినది. జ్యోతిష శాస్త్రం ప్రకారం. మూడవ రాశిలో బుధా దిత్య యోగం పట్టడం అనేది ఒక గొప్ప అదృ ష్టాన్ని సూచిస్తుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి చిక్కుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. కోర్టు కేసులో కూడా విజయం లభిస్తుంది.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఒకటవ రాశిలోనూ రెండవ రాశిలోనూ ఈ యోగం పడుతోంది. వ్యక్తిగత పురోగతి విషయంలో ఎవరు ఎన్ని అవరోధాలు ఆటంకాలు సృష్టిస్తున్నప్పటికీ వాటన్నిటినీ తప్పకుండా అధిగమించడం జరుగుతుంది. అతి ముఖ్యమైన ఒకటి రెండు ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కీచులాటలు తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఇంతవరకు మీ మాట వినని వారికి మీ మాటే వేదవాక్కు అవుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. ఆదాయపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..