Lucky Zodiac Signs: బుధాదిత్య యోగం.. అదృష్ట జాతకులంటే ఈ రాశులవారే!

Raja Yoga: డిసెంబర్ 30 నుండి జనవరి 14 వరకు ధనూ రాశిలో బుధ, రవులు యుతి చెందడంతో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఈ యోగం మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులకు రాజయోగం, అదృష్టం తెస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి, ఆర్థిక వృద్ధి, సామాజిక గుర్తింపు, సమస్యల పరిష్కారం వంటి శుభ ఫలితాలు లభిస్తాయి.

Lucky Zodiac Signs: బుధాదిత్య యోగం.. అదృష్ట జాతకులంటే ఈ రాశులవారే!
Budhaditya Yoga

Edited By:

Updated on: Dec 22, 2025 | 5:16 PM

Budhaditya Yoga: ఈ నెల (డిసెంబర్) 30వ తేదీ నుంచి ధనూ రాశిలో మళ్లీ బుధ, రవులు యుతి చెందడం జరుగుతోంది. జ్యోతిష శాస్త్రంలో ఈ బుధాదిత్య యోగానికి ఎంతో విశిష్టత ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి కలుగుతుంది. పదోన్నతి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలు వెలుగులోకి రావడం, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలగడం, ఈ యోగం పట్టినవారి సలహాలు, సూచనలకు విలువ, గుర్తింపు ఏర్పడడం వంటివి జరుగుతాయి. జనవరి 14 వరకూ కొనసాగే ఈ యోగం వల్ల మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారికి తప్పకుండా రాజయోగం, అదృష్ట యోగం పడతాయి.

  1. మేషం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల, పైగా దీన్ని భాగ్య స్థానాధిపతి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తల పెట్టినా బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాల్లో ఉంటున్న వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  2. మిథునం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశినాథుడు బుధుడు రవితో కలవడం వల్ల వ్యక్తిగత జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా పెరిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కనక వర్షం కురిపిస్తాయి. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. తప్పకుండా అధికారయోగం పడుతుంది. ఉద్యోగపరంగానే కాకుండా, సామాజికంగా కూడా గుర్తింపు లభిస్తుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశినాథుడైన రవితో బుధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. దీనివల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. ఎటువంటి వ్యక్తిగత సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఆస్తి సమస్యలను కూడా మధ్యవర్తిత్వంతో పరిష్కరించడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్ప కుండా విజయవంతమవుతుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు అంది వస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో వీరి సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపకరిస్తాయి.
  5. ధనుస్సు: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. ఎటువంటి వ్యక్తిగత సమస్యలైనా తేలికగా పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
  6. కుంభం: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలైన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ఏ పని తల పెట్టినా విజయవంతం అవుతుంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.