Budhaditya Yoga: నేటి నుంచి బుధాదిత్య యోగం.. ఈ మూడు రాశులకు విశేష ఫలితాలు.. వ్యాపారస్తులకు డబ్బే డబ్బు

|

Mar 16, 2023 | 10:58 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి జాతకంలో బుధాదిత్య యోగం ఏర్పడితే.. అతను సంపద, ఆనందం, శ్రేయస్సు, గౌరవాన్ని పొందుతాడు. ఈ యోగంలో ఒక బిడ్డ జన్మించినట్లయితే.. ఆ శిశువు కుటుంబం పేదది అయితే.. ఆ శిశువు ఆ కుటుంబానికి అదృష్టాన్ని తీసుకుని వస్తుంది

Budhaditya Yoga: నేటి నుంచి బుధాదిత్య యోగం.. ఈ మూడు రాశులకు విశేష ఫలితాలు.. వ్యాపారస్తులకు డబ్బే డబ్బు
Budhaditya Yoga
Follow us on

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మానవ జీవితంపై విశేష ప్రభావం చూపే గ్రహాల కలయిక వల్ల కాలానుగుణంగా అనేక రకాల శుభ రాజ యోగాలు ఏర్పడతాయి. అటువంటి శుభ యోగం మార్చి 16 నుండి 31 మధ్య ఏర్పడనుంది. ఈ శుభ యోగమే బుధాదిత్య యోగం. వేద  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆదిత్యుడు అంటే సూర్యుడు.. ఎవరి జాతకంలో సూర్యుడు .. బుధ గ్రహాలు రెండూ కలిసి ఉంటే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. బుధుడు సౌర వ్యవస్థలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. ఈ కారణంగా బుధుడు, సూర్యుడు జాతకంలో ఎక్కువ సమయం కలిసి కనిపిస్తారు. దాదాపు అందరి జాతకంలో బుధాదిత్య యోగం కనిపిస్తుంది. కుండలిలో బుధాదిత్య యోగం ఉన్న ఇల్లు దానిని బలపరుస్తుంది. జాతకంలో బుధుడు, సూర్యుడు కలిసి ఉన్నప్పుడు విశేష ఫలితాలు కలుగుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి జాతకంలో బుధాదిత్య యోగం ఏర్పడితే.. అతను సంపద, ఆనందం, శ్రేయస్సు, గౌరవాన్ని పొందుతాడు. ఈ యోగంలో ఒక బిడ్డ జన్మించినట్లయితే.. ఆ శిశువు కుటుంబం పేదది అయితే.. ఆ శిశువు ఆ కుటుంబానికి అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. ఆ కుటుంబంలో పేదరికం తగ్గి.. ధనవంతులుగా మారతారు. ఎవరి జాతకంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుందో..  వారి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

మార్చి 16 నుండి 31 వరకు బుధాదిత్య రాజయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుభ ఫలితాలను ఇచ్చే దేవగురువు బృహస్పతి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. దీని కారణంగా హన్స్ రాజయోగం ఏర్పడింది . ఇప్పుడు మార్చి 15 నుండి సూర్యుడు కూడా మీనరాశిలోకి ప్రవేశించాడు. మరోవైపు మార్చి 16వ తేదీ మీనరాశిలో బుధుడు ఉండటం వల్ల బుధాదిత్య రాజయోగానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఏర్పడిన బుధాదిత్య రాజయోగం చాలా బలమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఒక రాశిచక్రంలో ఒక గ్రహం సంచరించినప్పుడు..  ఆ రాశిచక్రం  పాలక గ్రహం ఇప్పటికే ఉంటే.. అది చాలా బలమైన రాజయోగంగా మారుతుంది. ఈ కారణంగా బుధాదిత్య రాజయోగం చాలా బలంగా ఉండటం వలన కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతాయో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి:
ఈ రాశి వారి లో పదకొండవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో.. ఈ రాశివారు ఒకేసారి అనేక ప్రయోజనాలను పొందే సూచనలు ఉన్నాయి. పనిలో మంచి విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగ ఆఫర్లు ..  సామర్థ్యంలో వృద్ధి సంకేతాలు కనిపిస్తాయి. బుధాదిత్య యోగం శుభ ప్రభావం వ్యాపారం చేసే వ్యక్తులపై కనిపిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు.. వ్యాపార అభివృద్ధికి అవకాశం ఉంది. మంచి వ్యక్తులతో వీరి అనుబంధం పెరుగుతుంది. ప్రభుత్వ పనులు పూర్తి అవుతాయి. ఈ రాశివారు లాభాలను పొందుతారు.

కర్కాటక రాశి
ఈ రాశి వారి జాతకంలో తొమ్మిదవ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. మీన రాశిలో బుధుడు, సూర్యుడు, బృహస్పతి కలయిక ఒక వరం. ఈ రాశి వ్యక్తులకు అదృష్టం కలుగుతుంది. ఎంత కష్టమైన పనులు ఎదురైనా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. పని పూర్తి అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ గౌరవం,  సంపదలో గణనీయమైన పెరుగుదలను చూడవచ్చు.

వృశ్చిక రాశి
ఈ రాశి వారిలో ఈ రాజయోగం ఐదవ ఇంట్లో ఏర్పడబోతోంది. శుభవార్త వింటారు. పిల్లలు సంతోషాన్ని పొందుతారు. అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. దీంతో ఈ రాశివారు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వ రంగాలలో పని చేసే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందం.. శాంతి నెలకొంటుంది. మీరు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)