Budhaditya Yogam: రేపు ఏర్పడనున్న బుధాదిత్య యోగం.. ఈ 3రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

|

Jan 06, 2024 | 8:30 AM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధాదిత్య రాజయోగం అత్యంత అదృష్టమైనదిగా, శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ యోగం వలన రాశుల్లో అత్యంత అదృష్టాన్ని కలిగి ఉంటాయి. ధనస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక ఏర్పడుతున్న బుధాదిత్య రాజయోగం వలన మూడు రాశులు అదృష్టాన్ని అందుకోనున్నాయి. ఈ రోజు ఆ మూడు రాశుల గురించి తెల్సుకుందాం.. రేపు (జనవరి 7 వ తేదీ ) ధనస్సు రాశిలో సూర్య, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్యయోగం ఏర్పడనుంది. ఈ యోగం వారం రోజుల పాటు ఉండనుంది.

Budhaditya Yogam: రేపు ఏర్పడనున్న బుధాదిత్య యోగం.. ఈ 3రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Budhaditya Rajayogam
Follow us on

జ్యోతిష్య శాస్త్రం గ్రహాల సంచారం, కదలికలు మానవుల జీవితంపై ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని వెల్లడిస్తాయి. ఈ నేపద్యంలో కొత్త ఏడాది మొదటి నెల జనవరిలోనే బహుళ యోగాలు ఏర్పడుతున్నాయి.. వీటిల్లో ఒకటి బుధాదిత్య రాజయోగం. నవగ్రహాల అధినేత సూర్యుడు.. బుధుడు రేపు కలవనున్నారు. దీనిని బుధాదిత్య యోగంగా పిలుస్తారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధాదిత్య రాజయోగం అత్యంత అదృష్టమైనదిగా, శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ యోగం వలన రాశుల్లో అత్యంత అదృష్టాన్ని కలిగి ఉంటాయి. ధనస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక ఏర్పడుతున్న బుధాదిత్య రాజయోగం వలన మూడు రాశులు అదృష్టాన్ని అందుకోనున్నాయి. ఈ రోజు ఆ మూడు రాశుల గురించి తెల్సుకుందాం..

రేపు (జనవరి 7 వ తేదీ ) ధనస్సు రాశిలో సూర్య, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్యయోగం ఏర్పడనుంది. ఈ యోగం వారం రోజుల పాటు ఉండనుంది. దీంతో వృషభ రాశి, ధనుస్సు రాశి, మేష రాశులకు అదృష్టంతో పాటు కనకవర్షం కురవనుంది.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు బుధాదిత్య యోగం వలన అన్నీ అనుకూల పరిమాణాలు ఏర్పడతాయి. ఆకశ్మిక ధనలాభం కలగనుంది. అంతేకాదు ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నవారు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ కలిగే అవకాశం ఉంది. వీరు కీర్తి ప్రతిష్ఠలను అందుకుంటారు. చేపట్టిన అన్ని పనులు సక్సెస్ అవుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో లాభాలు ఆర్జిస్తారు. మొత్తానికి ఈ రాశికి చెందిన వారు ఈ యోగం వలన ఆర్ధిక ప్రయోజనాలు అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వారు రేపు ఏర్పడనున్న బుధాదిత్య రాజయోగం వలన అన్ని పనులు నెరవేరతాయి. వ్యాపారస్తులు ఆర్ధిక లాభాలను అందుకుంటారు. కొత్తగా ఇల్లు, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మికంగా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్ధిక లాభాలను పొందుతారు. కొత్త ఆదయ మార్గాలు పెరగడంతో డబ్బులు చేతిలో ఉంటాయి. స్టూడెంట్స్ ఈ యోగం వలన కెరీర్ బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.

మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్య, బుధ కలయిక వలన ఏర్పడిన బుధాదిత్య రాజయోగం అత్యంత ప్రయోజనాలను చేకూరుస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి శుభ తరుణం. కెరీర్ లో అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యర్హ్డులకు అనుకూల సమయం.. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కు శుభ సమయం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు