Astrology Shubha Yoga
ఈ నెల 24వ తేదీ(శనివారం) నుంచి, పౌర్ణమి తర్వాత నుంచి చంద్ర సంచారం కారణంగా బుధ, శుక్ర, గురు గ్రహాల బలం పెరుగుతున్నందువల్ల శుభ యోగాలు, శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ శుభ గ్రహాలతో పాటు శని, కుజులు కూడా బాగా బలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి అనేక శుభ యోగాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. అవిః మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీనం. వీరికి ధన యోగాలు, అధికార యోగాలు తప్పకుండా సంభవించే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా చాలా సంవత్సరాల పాటు స్థిరత్వం కలగడానికి ఈ యోగాలు పునాది వేస్తాయి. ప్రస్తుతం గ్రహాల అనుకూల సంచారం ఏప్రిల్ చివరి వరకూ కొనసాగే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారికి రాహు కేతువులతో సహా ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉండడమనేది అది అరు దుగానే జరుగుతుంది. విపరీత రాజయోగం, మహాభాగ్య యోగం ఈ రాశివారికి ఒకేసారి పట్టడం జరిగింది. ఫలితంగా సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు.
- వృషభం: ఈ రాశికి నవమ, దశమ స్థానాలు శుభ గ్రహాలతో పటిష్ఠంగా ఉండడంతో పాటు లాభస్థానంలో ఉన్న రాహువు వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు రాబడి కూడా ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. విదేశీయానానికి, విదేశీ సొమ్ము అనుభవించడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోవడం జరుగుతుంది. సతీమణికి కూడా మహాభాగ్య యోగం పడుతుంది.
- తుల: ఈ రాశివారికి అనుకోని అదృష్టం కలసి రాబోతోంది. పదోన్నతులు లభించడంతో పాటు జీత భత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారడం వల్ల కూడా బాగా లబ్ధి పొందడం జరుగు తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం కావచ్చు. సంపన్నవ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అయి విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి విపరీత రాజయోగం పడుతుంది. లక్ష్మీయోగం కూడా పట్టే అవకాశం ఉంది. రెండు నెలల కాలంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మారిపోతుంది. విశేషమైన ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక, ప్రముఖులతో లాభదాయక పరిచయాల వల్ల కూడా ధన వృద్ధి సూచనలున్నాయి. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. అనుకోకుండా ఆస్తులు సమకూరే సూచనలు కూడా ఉన్నాయి.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో గ్రహ బలం ఎక్కువగా ఉన్నందువల్ల తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది. మకర రాశిలో ఉచ్ఛ కుజుడితో శుభ గ్రహం శుక్రుడు సంచరిస్తూ ఉండడం, ధన స్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు ఉండడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. నిరుద్యోగు లకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది.
- మీనం: ఈ రాశికి ధన, లాభ స్థానాలు శుభ గ్రహాలతో నిండి ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారమవుతుంద న్నట్టుగా ఉంటుంది. లాభధాయక పరిచయాలు పెరుగుతాయి. ఊహించని విధంగా ఐశ్వర్య యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. సామాజికంగా కూడా పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. విలాస జీవితం అలవడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..