Money Astrology: మకర రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి అంచనాలకు మించిన ధన లాభం.. !

Budha Gochar 2024: ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 19 వరకూ మకరంలో సంచారం చేయబోతున్న బుధ గ్రహం వల్ల వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక సంబంధమైన సమస్యలు, చిక్కుల నుంచి అతి వేగంగా బయటపడడం జరుగుతుంది. మకరం బుధుడికి మిత్ర క్షేత్రం. తప్పకుండా మంచి ఫలితాలిస్తాడు. ముఖ్యంగా మనసులోని కోరికలు నెరవేరుతాయి. సమస్యల ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది.

Money Astrology: మకర రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి అంచనాలకు మించిన ధన లాభం.. !
Money Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 25, 2024 | 6:54 PM

ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 19 వరకూ మకరంలో సంచారం చేయబోతున్న బుధ గ్రహం వల్ల వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక సంబంధమైన సమస్యలు, చిక్కుల నుంచి అతి వేగంగా బయటపడడం జరుగుతుంది. మకరం బుధుడికి మిత్ర క్షేత్రం. తప్పకుండా మంచి ఫలితాలిస్తాడు. ముఖ్యంగా మనసులోని కోరికలు నెరవేరుతాయి. సమస్యల ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం చక్కబడుతుంది. అంచనాలకు మించిన ధన లాభం కలుగుతుంది. బుధుడి మకర రాశి సంచారం వల్ల మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల వారు అనూహ్యంగా అదృష్టవంతులు కావడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన సమస్యలున్న పక్షంలో వాటి నుంచి కొద్ది ప్రయత్నంతో తప్పకుండా బయటపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగు తుంది. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబ డులు పెంచడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.
  2. వృషభం: ఈ రాశివారికి అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశీ సొమ్మును అనుభవించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. తండ్రి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
  3. కన్య: ఈ రాశి అధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో సంచారం ప్రారంభించినందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఈ రాశివారి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యో గాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశించిన దానికంటే ఎక్కు వగా ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు, ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అవుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి.
  4. తుల: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అయి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఎటువంటి ఒత్తిడి అయినా తగ్గిపో తుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. తల్లి నుంచి లేదా తల్లి వైపు వారి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో బుధ సంచారం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థులకు చదువుల్లో విజయాలు లభి స్తాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా చేతికి అందుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు అందుతాయి. శుభవార్తలు వింటారు.
  6. మకరం: ఈ రాశిలో బుధ సంచారం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతాయి. విదేశీయానానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. పితృవర్గం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణి స్తారు. అధికారుల వైఖరి సానుకూలంగా మారుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
  7. మీనం: ఈ రాశికి లాభస్థానంలో సంచరించబోతున్న బుధుడి వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవ కాశం ఉంది. గృహ, దాంపత్య సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహన యోగా నికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా జీతభత్యాల పెరుగుదలతో కూడిన ప్రమో షన్ లభిస్తుంది. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే