Budha Gochar 2024: కర్కాటక రాశిలోకి బుధుడి.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

| Edited By: Janardhan Veluru

Jun 24, 2024 | 7:04 PM

ఈ నెల 29వ తేదీ నుంచి బుధుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. బుధుడు ఈ కర్కాటక రాశిలో జూలై 19 వరకూ కొనసాగుతాడు. బుధుడు అదనపు ఆదాయానికి కారకుడు. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం, బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడం వంటి విషయాల్లో ఆరితేరినవాడు.

Budha Gochar 2024: కర్కాటక రాశిలోకి బుధుడి.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
Budha Gochar 2024
Follow us on

ఈ నెల 29వ తేదీ నుంచి బుధుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. బుధుడు ఈ కర్కాటక రాశిలో జూలై 19 వరకూ కొనసాగుతాడు. బుధుడు అదనపు ఆదాయానికి కారకుడు. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం, బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడం వంటి విషయాల్లో ఆరితేరినవాడు. దీని ఫలితంగా మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి ఒక ఇరవై రోజుల పాటు తప్పకుండా అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచడంతో పాటు, మరికొన్ని శుభ ఫలితాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది.

  1. మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ధన స్థానంలోకి ప్రవేశించడం వల్ల అదనపు ఆదాయ ప్రయ త్నాలు, ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పరిస్థితులు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ రాశి వారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడంతో పాటు ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆర్థిక లావా దేవీల వల్ల మంచి లాభాలను పొందుతారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశివారు అత్యంత కఠినంగా పొదుపు నియమాలను పాటిం చడం జరుగుతుంది. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు బాగా లాభి స్తాయి. లాభసాటి వ్యవహారాలు, లావాదేవీలతోనే ఎక్కువగా డీల్ చేయడం జరుగుతుంది. అద నపు ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనేక వ్యవహారాలు, సమస్యల విషయంలో క్రియాశీలంగా వ్యవహరిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  3. కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఆస్తి వివా దాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపా రాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరుగుతాయి. అతి ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
  4. తుల: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. ఉద్యో గులకు ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. అనేక విధాలుగా ఆదాయం అంచనాలకు మించి పెరుగు తుంది. అదనపు ఆదాయాన్ని షేర్లు, వడ్డీ, ఇతర వ్యాపారాల్లో మదుపు చేయడం జరుగుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి సప్తమంలో బుధ సంచారం వల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అంచనాలకు మించి విజయం సాధిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం పెంచుకునే విషయంలో యాక్టివిటీ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. పొదుపు పాటించడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది.
  6. మీనం: ఈ రాశికి పంచమంలో బుధ సంచారం జరుగుతున్నంత కాలం ఆదాయం దినదినాభివృద్ధి చెందు తూనే ఉంటుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించవచ్చు. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.