Vipreet Raj Yoga
పట్టుదలకు మారుపేరైన మకర రాశిలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 14 వరకూ బుధ, రవులు కలిసి ఉండడం వల్ల ఆరు రాశుల వారికి ఒక విధమైన విపరీత రాజయోగం ఏర్పడుతోంది. రవి, బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగమనే ‘సూక్ష్మబుద్ధి’ యోగం ఏర్పడుతోంది. అయితే, ఇది మకర రాశిలో ఏర్పడడం వల్ల మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి విపరీత రాజయోగాన్ని కలిగించడం విశేషం. ఈ యోగం వల్ల ఈ రాశులవారికి అదృష్టం తలుపు తడుతుంది. నిజానికి ఈ రెండు గ్రహాలు ఈ రాశిలో కలవడం సంపద వృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరగడంతో పాటు ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం కావడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ, రవులు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఎటు చూసినా లాభాలే కనిపి స్తాయి. ఆస్తి, కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. జీవితాన్ని అనేక విధాలుగా బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
- వృషభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల తండ్రి నుంచి, తండ్రి వైపు బంధువుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు లభించి సంపద వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఏ విధంగా చూసినా, ఏ చిన్న ప్రయత్నం చేసినా భాగ్యం అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.
- తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారు అధిక యోగం అనుభవిస్తారు. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడ తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకునే అవకాశం కూడా ఉంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ధనుస్సు: ధన స్థానంలో ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి ఆర్థిక వివాదమైనా, ఆర్థిక సమస్యయినా పరిష్కారం అవుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మొత్తం మీద అన్నివిధాలుగానూ ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంచనాలకు మించి సంపద వృద్ధి చెందుతుంది. మాటకు విలువ పెరుగు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది.
- మకరం: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న సొమ్ము కూడా అప్రయత్నంగా చేతికి అందు తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగు తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలు న్నాయి. ప్రభుత్వపరంగా అనేక ప్రయోజనాలు అందివస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
- మీనం: ఈ రాశివారికి లాభ స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా, ప్రభుత్వపరంగా లబ్ధి పొందు తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ సలహాలు, సూచనలకు డిమాండ్ పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.