AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercury Transit: ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని బుధల కలయిక.. ఈ 4 రాశుల వారు వృత్తి, వ్యాపారంలో విజయం సాధిస్తారు

గ్రహాల రాకుమారుడు బుధుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. జ్యోతిషశాస్త్రంలో ప్రస్తావించబడిన 27 నక్షత్రాలలో ఇది 26వ నక్షత్రం. ఉత్తరాభాద్రపద నక్షత్ర అధిపతి శనీశ్వరుడు. బుధుడికి శనిశ్వరుడికి మధ్య స్నేహం ఉందని.. ఈ రెండు స్నేహపూర్వక గ్రహాలు అని అంటారు. అటువంటి పరిస్థితిలో కొన్ని రాశిలకు చెందిన వ్యక్తులకు అనేక ప్రయోజనాలను అందిస్తారు. ఈ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Mercury Transit: ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని బుధల కలయిక.. ఈ 4 రాశుల వారు వృత్తి, వ్యాపారంలో విజయం సాధిస్తారు
Mercury Transit
Surya Kala
|

Updated on: Mar 03, 2025 | 5:56 PM

Share

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాలకు రాకుమారుడు అంటారు. జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహ సంచారాన్ని ముఖ్యమైనదిగా భావిస్తారు. ఎందుకంటే బుధుడు తెలివితేటలు, వ్యాపారం, తర్కం మొదలైన వాటికి కారకుడు. ఇతర గ్రహాల మాదిరిగానే బుధుడు కూడా రాశులను, నక్షత్రాలను ఒక నిర్ణీత సమయంలో మార్చుకుంటాడు. ఈ నేపధ్యంలో బుధుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఉత్తరాభాద్రపద నక్షత్రం 26వ నక్షత్రం. ఉత్తరాభాద్రపద నక్షత్రం మీన రాశి కిందకు వస్తుంది.

ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి బుధుడు ప్రవేశం

ఉత్తరాభాద్రపద నక్షత్ర అధిపతి శనీశ్వరుడు. మార్చి 2న ఉదయం 12:15 గంటలకు బుధుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. శని దేవుడికి , బుధుడికి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. కనుక ఉత్తరాభాద్ర నక్షత్రంలో బుధ సంచారము కొన్ని రాశుల వ్యక్తుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అకస్మాత్తుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందుతారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

వృషభ రాశి:

ఉత్తరాభాద్రపద నక్షత్రంలో బుధ సంచారము వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వృషభ రాశి వారు అసంపూర్ణమైన పనులు పూర్తి చేస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి:

ఉత్తరాభాద్రపద నక్షత్రంలో బుధ సంచారము కర్కాటక రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది. ఈ సమయంలో కెరీర్‌లో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వారు ఉద్యోగంలో బోనస్ పొందుతారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు.

ధనుస్సు రాశి:

ఉత్తరాభాద్రపద నక్షత్రంలో బుధ సంచారం ధనుస్సు రాశి వారికి శుభప్రదం. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వివాహానికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారస్తులు తమ పెట్టుబడులతో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో లాభం పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

సింహ రాశి:

ఉత్తరాభాద్రపద నక్షత్రంలో బుధ సంచారము సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో సింహ రాశి వారి ధైర్యం పెరిగే అవకాశం ఉంది. నిర్ణయాలలో విశ్వాసం ప్రతిబింబిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..