Birth Star Astrology: స్వస్థానాల్లో మూడు కీలక గ్రహాల సంచారం.. ఆ తొమ్మి నక్షత్రాల వారికి తప్పకుండా యోగదాయకం..
శనీశ్వరుడు, కుజుడు, శుక్రుడు స్వస్థానాలో బలంగా సంచారం చేస్తుండడం వల్ల వాటికి చెందిన నక్షత్రాలకు కూడా బలం పడుతోంది. ఫలితంగా మూడు గ్రహాల నక్షత్రాలు శుభ యోగాలు కలిగించబోతున్నాయి. శనీశ్వరుడు తన స్వస్థానమైన కుంభరాశిలోనూ, కుజుడు తన స్వస్థానమైన వృశ్చికంలోనూ, శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలోనో సంచరించడం జరుగుతోంది. ఫలితంగా శనికి చెందిన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు..

Birth Star Astrology
శనీశ్వరుడు, కుజుడు, శుక్రుడు స్వస్థానాలో బలంగా సంచారం చేస్తుండడం వల్ల వాటికి చెందిన నక్షత్రాలకు కూడా బలం పడుతోంది. ఫలితంగా మూడు గ్రహాల నక్షత్రాలు శుభ యోగాలు కలిగించబోతున్నాయి. శనీశ్వరుడు తన స్వస్థానమైన కుంభరాశిలోనూ, కుజుడు తన స్వస్థానమైన వృశ్చికంలోనూ, శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలోనో సంచరించడం జరుగుతోంది. ఫలితంగా శనికి చెందిన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు, కుజుడికి చెందిన మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు, శుక్రుడికి చెందిన భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు తప్పకుండా యోగదాయకం అవుతున్నాయి. ఈ తొమ్మిది నక్షత్రాలు ఏ విధంగా యోగాలివ్వబోయేదీ ఇక్కడ పరిశీలిద్దాం.
- భరణి: మేష రాశిలో ఉన్న ఈ నక్షత్రం అధిపతి శుక్రుడు తులా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా సిరిసంపదలనిస్తుంది. ఈ నక్షత్రానికి చెందిన వారికి సుఖ సంతోషాలతో పాటు భోగ భాగ్యాలు అమరుతాయి. ఇష్టమైన పనులన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా మనసులోని కోరికల్లో ఎక్కువ భాగం నెరవేరుతాయి. అందువల్ల ఈ నక్షత్రం వారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆకస్మిక ధన లాభంతో పాటు ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసివస్తాయి.
- మృగశిర: కుజుడికి చెందిన ఈ నక్షత్రం వృషభ, మిథున రాశుల్లో ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టినవారికి తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పడుతుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు, పలుకు బడి వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.
- పుష్యమి: శనీశ్వరుడికి చెందిన ఈ నక్షత్రం వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉండడంతో పాటు స్థిరత్వం కూడా ఉంటుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఉద్యో గంలో ప్రాబల్యం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం ప్రారంభం అవుతుంది. ఇష్టమైన ప్రదేశా లను సందర్శించడం, యాత్రలు చేయడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగు తుంది.
- పుబ్బ: శుక్రుడికి చెందిన ఈ నక్షత్రం వారు ఏ రంగానికి చెందినవారైనప్పటికీ బాగా కలిసి వస్తుంది. జీవన శైలిలో మార్పు వస్తుంది. కొత్త రకం స్నేహితులు పరిచయం అవుతారు. జీవితంలో కొత్త అధ్యా యం ప్రారంభం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమైనా, పెళ్లయినా దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. రాజకీయాల్లో లేదా ప్రభుత్వంలో ఉన్నవారికి రాజయోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది.
- చిత్త: కుజుడికి చెందిన ఈ నక్షత్రం వారు వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల సంఖ్య బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.
- అనూరాధ: శనీశ్వరుడికి చెందిన ఈ నక్షత్రం వారు అనేక సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. ఒక్కొక్క సమస్యా క్రమంగా దూరం అవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఇంట్లో సుఖ శాంతులు నెల కొంటాయి. సతీమణితో అపార్థాలు, విభేదాలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
- పూర్వాషాఢ: శుక్రుడికి చెందిన ఈ నక్షత్రం వారికి కోరుకున్న వ్యక్తితో కోరుకున్నరీతిలో వివాహం జరుగుతుంది. అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగుల ఆశలు,ఆశయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.
- ధనిష్ట: కుజుడికి చెందిన ఈ నక్షత్రం వారి ప్రతిభా పాటవాలు విశేషంగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. స్వయంగా ఒక ప్రముఖుడుగా మారే అవకాశం కూడా ఉంది. స్థిరా స్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎంతగానో లబ్ధిపొందుతారు.
- ఉత్తరాభాద్ర: శనీశ్వరుడికి చెందిన ఈ నక్షత్రం వారి మీద ఏలిన్నాటి శని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. శనీశ్వరుడు అనేక విధాలుగా మేలు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగా ల్లోనూ, ఆర్థికంగానూ స్థిరపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల్లో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విదేశీయానానికి, విదే శాల్లో ఉద్యోగం సంపాదించడానికి, విదేశాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుపడుతుంది.