Goddess Lakshami
ఈ నెల 14నుంచి 28వ తేదీ వరకు బుధుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తొమ్మిది గ్రహాల్లోనూ విశిష్ట గ్రహమైన బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ప్రవేశించడం వల్ల అనేక అనుకూలతలు కల్పిస్తాడు. బుధుడు తన స్వస్థానంలో సంచారం ప్రారంభించడంవల్ల నాలుగు రాశులకు భద్ర మహా పురుష యోగం ఏర్పడుతోంది. కేంద్రంలో, స్వస్థానంలో బుధుడు సంచారం చేస్తున్నప్పుడు మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు ఈ భద్ర యోగం ఏర్పడుతుంది. దీనివల్ల తెలివితేటలు, సమయస్ఫూర్తి పెరగడం, ప్రతిభా పాటవాలు ప్రకాశించడం, ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన లాభం వంటివి కలగడం జరుగుతాయి. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
- మిథునం: ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల అనేక ప్రయ త్నాలు సానుకూలపడతాయి. ఆటంకాలు, అవరోధాలు చాలావరకు తొలగిపోతాయి. జీవితం ఒక సానుకూల మలుపు తిరుగుతుంది. విదేశీయానానికి అవకాశం ఉంది. అత్యంత ప్రముఖ వ్యక్తు లతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- కన్య: ఈ రాశికి దశమ కేంద్రంలో బుధుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి భద్ర యోగం ఏర్పడింది. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపో తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ఉన్నత స్థానాలు లభిస్తాయి. నిరుద్యోగులకు అంచనాలకు మించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ఆస్తిపాస్తులు లభించే అవకాశముంది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ కేంద్రంలో బుధ సంచారం వల్ల భద్ర యోగం ఏర్పడింది. దీనివల్ల ఉత్తమ కుటుం బానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంటుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. అనేక విధాలుగా భాగ్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. తప్పకుండా అధికార యోగం, భాగ్య యోగం పడతాయి.
- మీనం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో బుధ సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడింది. దీని ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరగడం జరుగుతుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు సైతం కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. గృహ, వాహన యోగాలకు సంబంధించిన కోరికలు నెరవేరుతాయి. ఆస్తిపాస్తులు, సంపద కలిసి వస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.