Bhadra Raja Yoga: త్వరలో భద్ర రాజయోగం.. ఈ రాశులకు చెందిన వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు వైభోగం . .

|

Aug 17, 2024 | 7:13 AM

బుధగ్రహ తిరోగమన సమయంలో వచ్చే మార్పులతో అనేక రకాల ప్రభలను చూపించ నున్నదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రానున్న నెల సెప్టెంబర్‌ నెలలోని బుధుడి సంచారంలో రెండు సార్లు మార్పులు రానున్నాయి. మొదట ఈ గ్రహం సింహరాశిలోకి సంచారం చేయనుండగా.. ఆ తర్వాత క్రమంగా కన్యా రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఇలా బుధుడు రెండు రాశుల్లోకి సచారం చేయడం వలన సెప్టెంబర్ నెలలో భద్ర రాజ యోగం ఏర్పడనుంది

Bhadra Raja Yoga: త్వరలో భద్ర రాజయోగం.. ఈ రాశులకు చెందిన వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు వైభోగం . .
Bhadra Raja Yoga
Follow us on

నవగ్రహాల్లో శుభ గ్రహం బుధుడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహ సంచారం చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ప్రస్తుతం బుధ గ్రహం తిరోగమనంలో ఉంది. ఈ తిరోగమనంలో మార్పులు రావడంతో కొన్ని రాశులపై శుభప్రభావాలను చూపించనుండగా మరికొన్ని గ్రహాలపై చెడు ప్రభావాలను చూపిస్తుంది. బుధగ్రహ తిరోగమన సమయంలో వచ్చే మార్పులతో అనేక రకాల ప్రభలను చూపించ నున్నదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రానున్న నెల సెప్టెంబర్‌ నెలలోని బుధుడి సంచారంలో రెండు సార్లు మార్పులు రానున్నాయి. మొదట ఈ గ్రహం సింహరాశిలోకి సంచారం చేయనుండగా.. ఆ తర్వాత క్రమంగా కన్యా రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఇలా బుధుడు రెండు రాశుల్లోకి సచారం చేయడం వలన సెప్టెంబర్ నెలలో భద్ర రాజ యోగం ఏర్పడనుంది. అయితే ఈ రాశులకు చెందిన వ్యక్తులకు శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ఆ రాశులకు చెందిన వ్యక్తులు ఏ పనులు చేపట్టినా సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తారని జ్యోతిష్యులు చెప్పారు. ఈ నేపధ్యంలో రానున్న నెల రోజులు భద్ర యోగంతో బాగుపడే రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు భద్ర రాజయోగం వలన ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నవారి కెరీర్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు శుభ సమయం అని చెప్పవచ్చు. వ్యాపార సమస్యలకు పరిష్కరం లభిస్తుంది. ఆర్దికంగా లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో కూడా భద్ర రాజయోగం వలన అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా బాగుటుంది. పనుల్లో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. దంపతుల మధ్య వచ్చిన సమస్యలు పరిష్కారం అయి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులతో లాభాలను ఆర్జిస్తారు. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: భద్ర రాజయోగం ఈ రాశికి చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. తల్లిదండ్రుల సపోర్ట్ తో అనేక సమస్యలనుంచి బయటపడతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా గోల్డ్ బిజినెస్ చేస్తున్న వారికి ఈ యోగం లాభదాయకంగా మారుతుంది. కొత్త ఇల్లు, వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభ సమయం.. వీరి ప్రయత్నాలు ఫలిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు